హరితహారంలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2021-07-25T04:32:48+05:30 IST

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని నూ తన కలెక్టరేట్‌ వద్ద ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపుమేరకు ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటినట్లు చెప్పారు.

హరితహారంలో భాగస్వాములు కావాలి

నిజామాబాద్‌అర్బన్‌, జూలైౖ 24: హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని నూ తన కలెక్టరేట్‌ వద్ద ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపుమేరకు ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటినట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో కేక్‌కట్‌ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ నీతుకిరణ్‌, రెడ్‌కో చైర్మన్‌ ఎస్‌ఏ అలీం, ను డా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ మోహన్‌ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని జడ్పీచైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు ఆధ్వర్యంలో జడ్పీ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు.
మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలి
బోధన్‌/బోధన్‌రూరల్‌: మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించా లని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకల ను శనివారం బోధన్‌ నిర్వహించారు. శక్కర్‌నగర్‌ చౌరస్తా నుంచి బెల్లాల్‌ వరకు మొక్కలను నాటారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైౖర్మన్‌ తూము ప ద్మావతి శరత్‌ రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మి, గిర్ధావర్‌ గంగారెడ్డి పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం
ఆర్మూర్‌/నందిపేట: పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా శనివారం ఆర్మూర్‌ లోని దోబీఘాట్‌ వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వై స్‌చైర్మన్‌ మున్ను, ఖాందేశ్‌ శ్రీనివాస్‌, మోత్కురి లింగాగౌడ్‌ పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలోని పలిగుట్టపై ఉన్న శ్రీ కేదారేశ్వర ఆశ్రమం లో ఎమ్మెల్యే, కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వాకిడి సంతోష్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నక్కల భూమేష్‌, ఉల్లి శ్రీనివాస్‌గౌడ్‌, మండల కోఆప్ష న్‌సభ్యుడు సయ్యద్‌హుస్సెన్‌ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు పెంచడం అందరి బాధ్యత
మోపాల్‌/ఇందల్‌వాయి: మొక్కలు నాటే బాధ్యత తీసుకోవాలని ఎమ్మె ల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. బోర్గాం(పి) గ్రామంలో రోడ్డుకు ఇరువైపు లా మొక్కలు నాటారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా కేక్‌కట్‌ చేసి స్వీట్ల ను పంచిపెట్టారు. హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్ర తిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నారు. అందరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. రాష్ట్రంలో అటవీ సంపద తగ్గిందని ఏడు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతీ ఏడాదా హరితహార కా ర్యక్రమం చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అన్ని గ్రామాల్లో మొక్క లు నాటడంతో రాష్ట్రంలో అటవీ సంపద 3.8 శాతం పెరిగిందని దీని ద్వా రా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు పూర్తిస్థాయి లో నిండుతూ పంటలు బాగా పండుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో మరో 6.2శాతం అటవీ సంపద పెంపొందించి 33శాతం అడవులను పెం చాలన్నారు. ముఖ్యమంత్రి అనేక అభివృద్ధి పథకాలు తీసుకువచ్చి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అలాంటి వ్యక్తి దేశానికి ప్రధాని కావాలన్నారు. ఐటీశాఖ మంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ముక్కోటి వృక్షార్చణ కార్యక్రమం కొనసాగుతుందని శనివారం ఒక్కరోజే రూరల్‌ నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, కార్పొరేటర్‌ సౌజన్య పాల్గొన్నారు. ఇందల్‌వాయి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కేక్‌కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేష్‌నాయక్‌, ఎంపీడీవో, ఎఫ్‌ఆర్‌వో హిమచందన, బీట్‌ ఆఫీసర్‌లు పాల్గొన్నారు.
భీమ్‌గల్‌లో మొక్కలు నాటిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు
భీమ్‌గల్‌: మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని భీమ్‌గల్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో శనివారం వే డుకలను నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. కమిషనర్‌ గోపు గంగాధర్‌, కౌన్సిలర్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T04:32:48+05:30 IST