Advertisement

బఫెట్‌ వారసుడు గ్రెగ్‌ అబెల్‌

May 4 2021 @ 01:04AM

న్యూయార్క్‌: బెర్క్‌షైర్‌ హాత్‌వే ఇంక్‌.. కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) ఎవరనే ఊహాగనాలకు ఇన్వెస్టర్‌ మాంత్రికుడు వారెన్‌ బఫెట్‌ తెరదించారు. ప్రస్తుతం కంపెనీ వైస్‌ చైర్మన్‌గా ఉన్న గ్రెగ్‌ అబెల్‌.. సీఈఓ స్థానాన్ని అలంకరిస్తారని బఫెట్‌ వెల్లడించారు. అబెల్‌ ప్రస్తుతం బఫెట్‌ నిర్వహణలోని బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీకి చెందిన ఇన్సూరెన్స్‌యేతర వ్యాపారాలు చూస్తున్నారు. ‘ఈ రాత్రికి నాకు ఏమైనా జరగరానిది జరిగితే రేపు ఉదయమే గ్రెగ్‌ అబెల్‌.. బెర్క్‌షైర్‌ కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. దీనిపై మా కంపెనీ డైరెక్టర్ల మధ్య ఒప్పందం ఉంది’ అన్నారు. ఒకవేళ అబెల్‌కు కూడా ఏమైనా జరగరానికి జరిగితే కంపెనీ ఇన్సూరెన్స్‌ వ్యాపారం చూస్తున్న ప్రవాస భారతీయుడు అజిత్‌ జైన్‌.. బెర్క్‌షైర్‌ సీఈఓ అవుతారని బఫెట్‌ చెప్పారు.  

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.