ట్రంప్ నిష్క్రమణపై గ్రెటా సెటైరికల్ ట్వీట్ !

ABN , First Publish Date - 2021-01-21T18:05:18+05:30 IST

స్వీడన్‌కు చెందిన యువ పర్యావరణ ప్రచారకురాలు గ్రెటా థన్‌బర్గ్(17) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి సెటైరికల్ ట్వీట్ చేశారు.

ట్రంప్ నిష్క్రమణపై గ్రెటా సెటైరికల్ ట్వీట్ !

వాషింగ్టన్: స్వీడన్‌కు చెందిన యువ పర్యావరణ ప్రచారకురాలు గ్రెటా థన్‌బర్గ్(17) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి సెటైరికల్ ట్వీట్ చేశారు. వైట్‌హౌస్‌ను విడిచి వెళ్తున్న సమయంలో ట్రంప్ విమానం ఎక్కుతున్న ఫోటొను పోస్ట్ చేసిన గ్రెటా.. 'ఇది చూడటానికి చాలా బాగుంది. చూస్తుంటే అతను చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న వృద్ధుడిలా ఉన్నాడు.' అని గ్రెటా రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే, ట్రంప్‌పై గ్రెటా ఇలా సెటైర్ వేయడానికి ఓ కారణం ఉంది. యూఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ 2019లో గ్రెటా ప్రసంగించిన సమయంలో ట్విటర్ వేదికగా ట్రంప్ ఇదే మాదిరిగా కామెంట్ చేశారు. 


'ఇది చూడటానికి చాలా బాగుంది. చూస్తుంటే ఆమె చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న యువతిలా ఉంది.' అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ట్రంప్ నిష్క్రమణ సందర్భంగా గ్రెటాకు పగతీర్చుకునే అవకాశం లభించింది. ఇంకేముంది తనపై ట్రంప్ విసిరిన విమర్శలనే తిరిగి ఆయనపై తిప్పికొట్టారు గ్రెటా. దీంతో నెటిజన్లు ఆమెను సమయం చూసి దెబ్బ కొట్టారు అంటూ మెచ్చుకుంటున్నారు. తన టెంపరీతనంతో ప్రతి ఒక్కరిపై విమర్శలు గుప్పించే ట్రంప్‌కు ఇదే సరియైన సమాధానం అంటూ ఆమెను పొగుడుతున్నారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.     



Updated Date - 2021-01-21T18:05:18+05:30 IST