వైరల్ అవుతోన్న వరుడి వీడియో.. వధువును ముద్దాడుతూ కంటతడి.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2022-01-23T01:19:45+05:30 IST

ప్రస్తుతం ఓ వరుడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వధువుకు చెంపలపై ముద్దిస్తూ కంటితడి పెట్టాడు. ఆ తర్వాత వధువు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వధూవరులకు కంగ్రాట్స్

వైరల్ అవుతోన్న వరుడి వీడియో.. వధువును ముద్దాడుతూ కంటతడి.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఓ వరుడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వధువుకు చెంపలపై ముద్దిస్తూ కంటితడి పెట్టాడు. ఆ తర్వాత వధువు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వధూవరులకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. 


యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చడంతో వాళ్లకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నారు. పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేసి, ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే సంప్రదాయబద్దమైన దుస్తుల్లో అందంగా ముస్తాబై వేదిక వద్దకు వస్తున్న వధువును చూసి వరుడు భావోద్వేగానికి లోనయ్యాడు. స్టేజిపైకి ఎక్కేందుకు ఆమెకు చెయ్యి అందించడంతోపాటు.. వేదికపైకి వచ్చిన తర్వాత వధువు చెంపలను ముద్దాడాడు. ఈ క్రమంలో వరుడిని చూసి వధువు కూడా ఎమోషనల్ అయింది. వరుడి కంటి నుంచి వస్తున్న ఆనందభాష్పాలను తన చేతులతో తుడిచింది. అనంతరం ఇద్దరూ ఆనందంతో స్టేజీపై డ్యాన్స్ చేశారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. వధూవరుల ప్రేమానురాగాలను చూసి.. కామెంట్ల రూపంలో నెటిజన్లు వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు.






Updated Date - 2022-01-23T01:19:45+05:30 IST