పెళ్లి వేడుకలోనే అంత పొగరా.. వరుడిపై నెటిజన్ల ట్రోలింగ్!

Jul 22 2021 @ 12:00PM

ఏంతో ప్రేమగా చూసుకోవాల్సిన కాబోయే భార్య పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. పెళ్లి వేడుకలోనే వధువును అవమానించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోలోని వరుడి ప్రవర్తనను నెటిజన్లు తప్పుపడుతున్నారు. నిరంజన్ అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 


ఈ వీడియో ప్రకారం.. పెళ్లి వేడుకలో వధూవరులిద్దరూ దండలు మార్చుకునే కార్యక్రమం జరుగుతోంది. వరుడి మెడలో వధువు దండ వేయగా.. వరుడు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వధువు మెడలో వేయాల్సిన దండను ఆమె మీదకు విసిరి పడేశాడు. దీంతో ఆ దండ ఆమె కాళ్ల దగ్గర పడింది. దాన్ని తీసి మళ్లీ వేయడానికి ఆ వరుడు ఆసక్తి చూపించలేదు. వరుడి ప్రవర్తన చూస్తూ వధువు అలా నిలబడిపోయింది. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుడిపై విరుచుకుపడుతున్నారు. `పెళ్లి వేడుకలోనే ఇలా ప్రవర్తించాడంటే.. ఇక తర్వాత ఎలా ఉంటాడో`, `అంత ఇష్టం లేకపోతే పెళ్లికి ఎందుకు అంగీకరించాడు` అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...