కొద్దిసేపటిలో పెళ్లి జరగనుండగా వరుడు మాయం... వధువు చేసిన పనిని మెచ్చుకున్న అతిథులు!

ABN , First Publish Date - 2022-09-28T15:12:49+05:30 IST

పెళ్లి రోజున వరుడు హఠాత్తుగా మాయమయ్యాడు. ఈ సంగతి తెలుసుకున్న...

కొద్దిసేపటిలో పెళ్లి జరగనుండగా వరుడు మాయం... వధువు చేసిన పనిని మెచ్చుకున్న అతిథులు!

పెళ్లి రోజున వరుడు హఠాత్తుగా మాయమయ్యాడు. ఈ సంగతి తెలుసుకున్న వధువు కంగుతింది. ఆమెకు ఒక్కసారిగా గుండె పగిలి పోయినట్లు అనిపించినా వరుడు లేకుండానే పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది. పెళ్లికొడుకు లేకుండానే పెళ్లి ఫొటోలను కూడా క్లిక్ మనిపించారు. వివరాల్లోకి వెళితే బ్రిటన్‌లోని వేల్స్‌లో నివసిస్తున్న కైలీ స్టెడ్ వివాహం సెప్టెంబర్ 15న జరగాల్సి ఉంది. ఈ వివాహ నిర్వహణకు దాదాపు రూ. 10 లక్షలు ఖర్చు చేశారు. ఇంతలో వరుడు మాయమయ్యాడని కైలీకి తెలిసింది. ఇది విన్న కైలీకి దిక్కుతోచలేదు. అయితే ఇలా జరిగినప్పటికీ అతిథి మర్యాదలు పాటించడంతో పాటు వివాహ  కార్యక్రమాలన్నీ పూర్తిచేసింది. బీమా కంపెనీలో పనిచేస్తున్న కైలీ, తాను వరుడి కోసం 4 గంటల పాటు వేచి ఉన్నానని చెప్పింది. పలుమార్లు అతనిని సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదని తెలిపింది. అతను రావడం లేదని తెలిసిన వెంటనే కంగారు పడ్డానని చెప్పింది.


కైలీకి, ఆమె ప్రియునికి 2018లో పరిచయమయ్యింది. అతను 2020లో కైలీకి ప్రపోజ్ చేశాడు. పెళ్లికి ఒకరోజు ముందు కైలీ, ఆమె స్నేహితులు హాలిడే హోమ్స్‌లో వేడుకలు చేసుకున్నారు. వరుడు, అతని స్నేహితులు కూడా అక్కడికి సమీపంలో పార్టీ చేసుకున్నారు. నాటి అనుభవం గురించి కైలీ మాట్లాడుతూ ‘నేను, నా ప్రియుడు పెళ్లికి ఒక రోజు ముందు మాట్లాడుకోకూడదని నిర్ణయించుకున్నాం. అటువంటి పరిస్థితిలో, అతనికి ఏమయ్యిందో అస్సలు తెలియలేదు. నా బాయ్ ఫ్రెండ్ స్నేహితునికి ఫోన్ చేస్తే అతను వెళ్లిపోయాడని చెప్పాడు. కైలీ అత్త కూడా ఇటువంటి సమాధానమే ఇచ్చారని తెలిపింది. కాలం గడుస్తున్న కొద్దీ కైలీ ఆశలు సన్నగిల్లాయి. ఇంతలో వరుడి కుటుంబం కూడా మాయమయ్యింది. అయితే కైలీ వివాహానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను నెరవేర్చింది. కైలీ తన తండ్రి, సోదరులు, వరుడి స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసింది. అంతకుముందు కైలీ, ఆమె ప్రియుడు టర్కీలో హనీమూన్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ సంఘటన తర్వాత కైలీ స్నేహితులు క్రౌడ్ ఫండింగ్ కోసం ఒక పేజీని సృష్టించారు. దీని ద్వారా వచ్చిన మొత్తంతో పెళ్లి రోజున జరిగిన ఖర్చులను భర్తీ చేయవచ్చని భావిస్తున్నారు. 



Updated Date - 2022-09-28T15:12:49+05:30 IST