ltrScrptTheme3

పెళ్లి చూపులకు వెళ్లిన కుర్రాడు.. అమ్మాయిని చూసిన కొద్ది నిమిషాల్లోనే వాట్సప్‌లో నగ్నంగా ఆమె ఫొటో..

Oct 26 2021 @ 13:02PM

ఇంటర్నెట్ డెస్క్: యువతికి పెళ్లీడు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అబ్బాయి.. పెళ్లి చూపుల కోసం ఆమె ఇంటికి వెళ్లాడు. దీంతో అందంగా ముస్తాబైన ఆమె.. అతడికి టీ అందించింది. అనంతరం అక్కడే కూర్చుంది. అబ్బాయికి ఆ యువతి నచ్చడంతో ఇరు కుటుంబ సభ్యులూ ఇతర విషయాలను మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆ అబ్బాయికి ఓ వాట్సప్ మెసేజ్ వచ్చింది. అది చూసి, అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. విషయం ఆ యువతికీ తెలియడంతో ఆమె కూడా కంగుతింది. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


అస్సాం రాజధాని దిస్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన కూతురుని ఆయన స్తోమత కొద్దీ చదివించాడు. పెళ్లీడు రావడంతో.. తన కూతురికి తగిన వాడిని వెతికే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే అబ్బాయిని చూశాడు. అమ్మాయిని చూసుకోవడానికి ఇంటికి రావాల్సిందిగా కోరాడు. దీంతో తాజాగా ఆ అబ్బాయి సన్నిహితులతో కలిసి.. ఆ యువతి ఇంటికి వెళ్లాడు. అందంగా ముస్తాబై వచ్చి, టీ అందించిన ఆమెను చూసి, ఓకే చెప్పేశాడు. యువతికి కూడా అతడు నచ్చడంతో ఇరు కుటంబ సభ్యలు ఇతర విషయాలను మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇంతలో ఆ అబ్బాయికి ఓ వాట్సప్ మెసేజ్ వచ్చింది. 


అందులో.. తాను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అమ్మాయి నగ్నఫొటో ఉండటంతో అతడు షాకయ్యాడు. ఈ విషయం ఆ అమ్మాయి కూడా మొదట కంగుతింది. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి, తన కజీన్‌పై ఫిర్యాదు చేసింది. తాను చదువుకుంటున్న సమయంలో ఓ రోజు కాలేజీకి వెళ్తుండగా.. తన ద్విచక్ర వాహనం చెడిపోయినట్లు చెప్పింది. ఈ క్రమంలో తన కజీన్ తన ఫ్రెండ్ కారులో తనను కాలేజీ వద్ద డ్రాప్ చేస్తానని చెప్పడంతో అతడిని నమ్మినట్టు చెప్పింది. కారులో ఎక్కిన తర్వాత అతడు తనకు ఓ కిల్‌డ్రింక్ ఇచ్చాడని.. అది తాగిన వెంటనే స్పృహ కోల్పోయినట్టు పేర్కొంది. అనంతరం తన ఫ్రెండ్‌తో కలిసి తనపై అత్యాచారం చేసినట్టు వివరించింది. ఈ సమయంలోనే అతడు తన నగ్న ఫొటోలను తీసుంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిపై చర్యలు తీసుకుంటామని సదరు యువతికి హామీ ఇచ్చారు. 



Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.