Viral video: పెళ్లి వేదిక మీదే వ‌ధువును కొట్టిన వ‌రుడు.. ఎందుకో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-03-04T20:35:26+05:30 IST

సంసార జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. ఆ క్రమంలో ఒకరి మీద ఒకరు చేయి చేసుకోవడం కూడా సాధారణ విషయమే.

Viral video: పెళ్లి వేదిక మీదే వ‌ధువును కొట్టిన వ‌రుడు.. ఎందుకో తెలిస్తే షాక్!

సంసార జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. ఆ క్రమంలో ఒకరి మీద ఒకరు చేయి చేసుకోవడం కూడా సాధారణ విషయమే. అయితే పెళ్లి వేదిక మీదే కొట్టుకున్న వధూవరులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఆ వీడియో చూస్తే.. న‌వ్వాలో ఏడ‌వాలో అర్థం కాదు. పెళ్లి జ‌రుగుతుండ‌గానే, పెళ్లి వేదిక మీద పెళ్లి కూతురును పెళ్లి కొడుకు చిత‌క‌బాదాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 


పెళ్లి వేదిక మీద వధువుకు పెళ్లి కొడుకు స్వీటు తినిపించ‌బోయాడు. అయితే పెళ్లి కూతురు ఆ స్వీట్ తినకుండా మొహం తిప్పేసుకుంది. దీంతో వరుడు ఆ స్వీటును ఆమె మొహం మీద విసిరికొట్టాడు. వెంటనే వధువు ప్లేటులో ఉన్న మ‌రో స్వీటును తీసుకొని అత‌డి మీద విసిరేసింది. దీంతో వరుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వేదిక మీదే ఆమెను చిత‌క‌బాదాడు. ఈ వీడియోకు సోష‌ల్ మీడియాలో మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ వ‌చ్చాయి. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి త‌ర్వాత వాళ్ల జీవితం ఎలా ఉండ‌బోతోందో ఇప్పుడే క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. 



Updated Date - 2022-03-04T20:35:26+05:30 IST