
పెళ్లి వైభవంగా జరుగుతోంది.. వధూవరులు ఏడడుగులు కలిసి నడిచారు.. అయితే అప్పటికే వరుడి ప్రవర్తన మీద వధువు తరఫు వారికి అనుమానం మొదలైంది.. వరుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వారికి అనిపించింది.. అందుకే వధువును అత్తింటికి పంపలేమని చెప్పారు.. దీంతో వరుడు తీవ్ర ఆగ్రహానికి గురై బంధువులందరి ముందు తన దుస్తులను విప్పి పడేసి పెద్దగా అరవడం ప్రారంభించాడు. వరుడిని అతడి కుటుంబ సభ్యులు బస్సు సీటుకు కట్టేసి తమ వెంట తీసుకెళ్లారు. మధ్యప్రదేశ్లోని దామోహ్లో ఈ ఘటన జరిగింది.
వరుడి కుటుంబం బుధవారం రాత్రి నర్సింగపూర్ జిల్లా నుంచి దామోహ్కు ఊరేగింపుగా చేరుకుంది. కచోరా బజార్లో ఉన్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో వివాహ వేడుకలు జరిగాయి. వివాహ వేడుకల్లో వరుడు వింతగా ప్రవర్తించాడు. వధువు, ఆమె కుటుంబ సభ్యులు ఇదంతా చూస్తూనే ఉన్నారు. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. అయితే చివరకు వరుడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు తెలుసుకున్నారు. అతడితో తమ కూతురిని పంపేందుకు నిరాకరించారు.
విషయం తెలుసుకున్న వరుడు తీవ్ర ఆగ్రహానికి గురై బంధువులందరి ముందు తన దుస్తులను విప్పి పడేసి పెద్దగా అరవడం ప్రారంభించారు. వరుడిని అతడి కుటుంబ సభ్యులు బస్సు సీటుకు కట్టేసి తమ వెంట తీసుకెళ్లారు. వరుడి కుటుంబం తమను మోసం చేసిందని వధువు కుటుంబ సభ్యులు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి