అందంగా ముస్తాబైన వధువు.. ఆమెను చూసి వరుడు ఫిదా.. అతడు చేసిన పనికి ఆశ్చర్యపోయిన అతిథులు

ABN , First Publish Date - 2022-03-17T22:09:05+05:30 IST

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వరుడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందంగా ముస్తాబై స్టేజీ మీదకు వస్తున్న వధువును చూసి వరుడు ఫిదా అయ్యాడు. అనంతరం తన మదిలోని భావాన్ని

అందంగా ముస్తాబైన వధువు.. ఆమెను చూసి వరుడు ఫిదా.. అతడు చేసిన పనికి ఆశ్చర్యపోయిన అతిథులు

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వరుడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందంగా ముస్తాబై స్టేజీ మీదకు వస్తున్న వధువును చూసి వరుడు ఫిదా అయ్యాడు. అనంతరం తన మదిలోని భావాన్ని అందరి ముందే వినూత్నంగా వ్యక్త పరిచాడు. అది చూసిన నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ముహూర్తం సమయానికి బంధుమిత్రులు, అతిథులు వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. వరుడు కూడా సూటూ బూటు వేసుకుని హ్యాండ్సమ్‌గా తయారై.. వేదికపైకి చేరుకున్నాడు. అనంతరం వధువు ఎంట్రీ ఇచ్చింది. సంప్రదాయ పద్ధతిలో అందంగా ముస్తాబై.. స్నేహితులతో కలిసి స్టేజీ వద్దకు చేరుకున్న వధవును చూసి వరుడు ఫిదా అయ్యాడు. ఆమె అందాన్ని మాటలతో వర్ణించలేక.. చేతల్లో చూపించాడు. నవ్వుతూ వెనకాలే ఉన్న అతడి స్నేహితుల చేతుల్లోకి వాలిపోయాడు. అనంతరం వధువు దగ్గరకు వెళ్లి, చేయందించి మరీ వేదిక మీదకు ఆహ్వానించాడు. దీంతో అక్కడున్న కొందరు అతిథులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కాగా.. దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ వధూవరుల జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలిపుతున్నారు. 






Updated Date - 2022-03-17T22:09:05+05:30 IST