జిల్లాకు చేరిన వేరుశనగ విత్తనాలు

ABN , First Publish Date - 2022-05-17T06:53:49+05:30 IST

సబ్సిడీపై రైతులకు అందజేసే వేరుశనగ విత్తనాలు సోమవారం తొలి విడతగా 500 క్వింటాళ్లు వచ్చాయి.

జిల్లాకు చేరిన వేరుశనగ విత్తనాలు
జిల్లాకు చేరిన వేరుశెనగ విత్తనాలు

చిత్తూరు (సెంట్రల్‌), మే 16: సబ్సిడీపై రైతులకు అందజేసే వేరుశనగ విత్తనాలు సోమవారం తొలి విడతగా 500 క్వింటాళ్లు వచ్చాయి. వాటిని రొంపిచెర్ల, సదుం మండలాలకు చేర్చారు. ఖరీఫ్‌లో జిల్లాలోని రైతులకు 41,800 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలు పంపారు. జిల్లాలో అధికంగా డిమాండ్‌ ఉన్న కే-6 రకం విత్తనాలు ఏపీ సీడ్సీ సరఫరా చేయనుంది. 30 కిలోల బస్తా ధర రూ.2,574లు కాగా సబ్సిడీ రూ.1,030 పోను రైతులు రూ.1,544 చెల్లించాల్సి ఉంది. నెల చివరి వారంలో ఆర్బీకేల ద్వారా విత్తనాలు పంపిణీ చేయనున్నారు.


Updated Date - 2022-05-17T06:53:49+05:30 IST