గ్రూప్‌-1 పోస్టుల భర్తీ జరగక పదేళ్లయ్యింది..!

ABN , First Publish Date - 2021-11-04T13:48:47+05:30 IST

గ్రూప్‌-1 పోస్టులను..

గ్రూప్‌-1 పోస్టుల భర్తీ జరగక పదేళ్లయ్యింది..!

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య 


రాంనగర్‌(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 పోస్టులను గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం భర్తీ చేయడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు. అలాగే, గ్రూప్‌-2 పోస్టులకూ5 సంవత్సరాలుగా నోటిఫికేషన్‌ ఇవ్వలేదని చెప్పారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో నిరుద్యోగ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరుద్యోగుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు. వెంటనే గ్రూప్‌- 1, 2, 3, 4 సర్వీస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటా కింద భర్తీ చేయాల్సిన ఉద్యోగాలను పూర్తి స్థాయిలో లెక్కించి గణన చేసి భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 



Updated Date - 2021-11-04T13:48:47+05:30 IST