అన్నా క్యాంటీన్ల ఏర్పాటులో రెచ్చిపోయిన కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు వర్గాలు

ABN , First Publish Date - 2022-09-05T19:52:47+05:30 IST

సత్తెనపల్లి(Sathenapalli) ఎన్టీఆర్ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ భవన్(NTR Bhavan) వద్ద రెండు అన్నా క్యాంటిన్‌(Anna Canteen)లను

అన్నా క్యాంటీన్ల ఏర్పాటులో రెచ్చిపోయిన కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు వర్గాలు

పల్నాడు జిల్లా : సత్తెనపల్లి(Sathenapalli) ఎన్టీఆర్ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ భవన్(NTR Bhavan) వద్ద రెండు అన్నా క్యాంటిన్‌(Anna Canteen)లను ఏర్పాటు చేశారు. కోడెల శివరాం(Kodeal Sivaram), వై.వి.ఆంజనేయులు(YV Anjaneyulu) వర్గాలు ఆ క్యాంటీన్‌లను ఏర్పాటు చేశారు. కోడెల శివరాం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్లెక్సీల(Anna Canteen Flexies)ను వైవీ ఆంజనేయులు వర్గం తొలగించింది. ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. ఈ వర్గాల మధ్య వాగ్వివాదం.. పరస్పర దూషణలతో ఆ ప్రాంతమంతా రణరంగంలా మారిపోయింది. క్యాంటీన్ల దగ్గరకు పెద్ద సంఖ్యలో ఇరువర్గాల కార్యకర్తలు చేరుకున్నారు. వైవీ ఆంజనేయలు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు(Nakka Anand Babu) ప్రారంభించారు. కోడెల శివరాం వర్గం(Kodela Sivaram Group) అన్నా క్యాంటిన్‌లో అన్నదానం ప్రారంభించారు. రెండు చోట్ల పేదలకు టీడీపీ నాయకులు అన్నదానం చేశారు. ఎన్టీఆర్ భవన్(NTR Bhavan) వద్ద కొద్దిసేపు ఉత్కంఠ కొనసాగింది. 


సత్తెనపల్లి టీడీపీ (TDP)లో లుకలుకలు కొనసాగుతున్నాయి. ఈ విషయం అధిష్టానం దృష్టికి సైతం చేరింది. దీంతో అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగలని పార్టీ ఆదేశిచింది. అయితే అధిష్టానం ఆదేశాలను ఇద్దరు నేతలూ పట్టించుకోలేదు. వర్గాల వారీగా అన్నా క్యాంటిన్‌లు ఏర్పాటు చేశారు. నిన్న తెలుగు యువత నేత మల్లి ఆధ్వర్యంలో అన్నా క్యాంటిన్ ప్రారంభమైంది. నేడు మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో అన్నా క్యాంటిన్ ఏర్పాటు చేశారు. దీంతో అన్నా క్యాంటిన్‌ల ఏర్పాట్లు రచ్చరచ్చగా మారిపోయింది.

Updated Date - 2022-09-05T19:52:47+05:30 IST