గ్రూప్‌-1 ప్రిలిమినరీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2022-10-01T04:44:48+05:30 IST

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 16న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ికలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ అధికారులను ఆదేశించారు

గ్రూప్‌-1 ప్రిలిమినరీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌


 సిద్దిపేటఅగ్రికల్చర్‌, సెప్టెంబరు30: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 16న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ికలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలో 24 కేంద్రాలను టీఎ్‌సపీఎస్సీ గుర్తించిదన్నారు. ఈనెల 6లోగా పరీక్ష కేంద్రాలను సిద్ధం చేయాలని చెప్పారు. ప్రతీ సెంటర్‌లో ప్రిన్సిపాల్‌ గదితో పాటు పరీక్ష నిర్వహించే అన్ని తరగతి గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రతీ పరీక్ష కేంద్రంలో అన్ని వసతులు సక్రమంగా ఉండాలని సూచించారు. పరీక్ష జరిగే 16వ తారీఖున 24 గంటలు కోతలు లేని విద్యుత్‌ సరఫరా అయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ ప్రభాకర్‌ను ఆదేశించారు. ప్రతీ సెంటర్‌ వద్ద వైద్యశిబిరం ఏర్పాటు చేసి అత్యవసర మందులతో ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచాలన్నారు. వీలైనన్ని 108 వాహనాలను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కాశీనాథ్‌కు సూచించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులను నడపాలని, రవాణాశాఖ సహకారంతో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు తెలిసేలా హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు. పరీక్ష పత్రాలను భద్రంగా సెంటర్‌కు చేర్చి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ శ్వేతకు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణకు చీఫ్‌ కోఆర్డినేటర్‌గా జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డిని నియమిస్తూ అన్ని పరీక్ష కేంద్రాలను ముందస్తుగా పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి సూర్యప్రకాష్‌, కలెక్టరేట్‌ ఏవో రెహమాన్‌, విద్యాశాఖ అధికారులు, పరీక్ష నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T04:44:48+05:30 IST