TS News: తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

ABN , First Publish Date - 2022-10-16T15:54:49+05:30 IST

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం తొలిసారిగా గ్రూప్-1 (Group-1) ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తోంది.

TS News: తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం తొలిసారిగా గ్రూప్-1 (Group-1) ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Examination) నిర్వహిస్తోంది. ఇందు కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫకేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 80 వేల 202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 1019 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రంలోకి ఉదయం 8:30 నిమిషాల నుంచి అనుమతిస్తున్నారు. 10:15 నిమిషాలు దాటితే పరీక్షా కేంద్రంలోనికి అనుమతి ఉండదు. మరో రెండు నెలల్లో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఐడీ ప్రూఫ్‌ని తీసుకెళ్లవలసి ఉంటుంది. పరీక్ష కేంద్రంలోనికి మొబైల్ ఫోన్, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, వాచ్ క్యాలిక్యులేటర్, వాలెట్ పర్స్, నోట్స్ రికార్డింగ్ తదితర పరికరాలను అనుమతించడంలేదు. మహిళలు వివాహితులయితే కేవలం మంగళసూత్రం మాత్రమే అనుమతిస్తారు. షూస్ కూడా ధరించటానికి వీల్లేదు. చేతులకు, పాదాలకు మెహందీ, టాటూలు ఉండకూడదని నిబంధనలు విధించారు.

Updated Date - 2022-10-16T15:54:49+05:30 IST