గృహహింస నిరోధక చట్టం మహిళలకు ఆయుధం

ABN , First Publish Date - 2021-02-28T04:38:10+05:30 IST

గృహహింస నిరోదక చట్టం మహిళలకు ఆయుధమని 4వ జిల్లా అదనపు జడ్జీ సీవీఎ్‌స.సాయిభూపతి అన్నారు.

గృహహింస నిరోధక చట్టం మహిళలకు ఆయుధం
మాట్లాడుతున్న న్యాయమూర్తి సీవీఎ్‌స.సాయిభూపతి

4వ జిల్లా అదనపు జడ్జీ సీవీఎ్‌స.సాయిభూపతి

సత్తుపల్లిరూరల్‌, ఫిబ్రవరి 27: గృహహింస నిరోదక చట్టం మహిళలకు ఆయుధమని 4వ జిల్లా అదనపు జడ్జీ సీవీఎ్‌స.సాయిభూపతి అన్నారు. ఐసీడీఎస్‌ కార్యాలయంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. వివిధ రకాలుగా గృహాల్లో వేధించబడి నిస్సహాయతకు గురైన మహిళకు అండగా నిలబడి న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించరన్నారు. మహిళలను శారీరకంగా, మానసికంగా హింసించడం, బాధించడం, కించపరచడం, ఆర్ధిక ఇబ్బందులు కలిగించడం, బెదిరించడం, దౌర్జన్యానికి పాల్పడటం ఇవన్నీ గృహహింస పరిధిలోకి వస్తాయన్నారు. గృహహింసపై ఫిర్యాదు పరిష్కారానికి పోలీసు, మహిళ శిశు సంక్షేమం, న్యాయశాఖలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జీ శ్రావణిస్వాతి, న్యాయవాదులు వంకదారు రామకృష్ణ, భాషా, సీడీపీవో కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-28T04:38:10+05:30 IST