నిధులేవీ?

ABN , First Publish Date - 2022-08-11T05:20:53+05:30 IST

మునిసిపాలిటీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం(క్లాప్‌) కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించింది. క్లాప్‌ అమలులో మునిసిపాల్టీలు విఫలమవుతున్నాయి.

నిధులేవీ?
నరసరావుపేట గుంటూరు రోడ్డులోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద జీఎస్‌టీ నిర్మాణానికి కేటాయించిన స్ధలం

జగనన్న స్వచ్ఛ సంకల్పానికి నిధుల కొరత

చెత్త రవాణా కేంద్రాల నిర్మాణంలో తీవ్ర జాప్యం

రూ.10.15 కోట్ల వ్యయంలో నిర్మాణాలు


 ఇంటింటి సేకరించిన వ్యర్ధాలను తరలించేందుకు చెత్త రవాణా కేంద్రాల నిర్మాణాన్ని అన్ని పురపాలక సంఘాల్లో చేపట్టారు. ఈ పనులు నత్తనడక  సాగుతున్నాయి. వీటికి నిధుల కొరత వెంటాడుతోంది. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో రూ.10.15 కోట్ల వ్యయంతో చేపట్టిన చెత్త రవాణా కేంద్రాల నిర్మాణాలను చేపట్టారు. వీటి పనులు ప్రారంభించి 6 నెలలు గడిచినా ఒక్క కేంద్రం నిర్మాణం కూడా పూర్తి కాకపోవడం గమనార్హం.చెత్త పన్నుపై ఉన్న చిత్తశుద్ధి.. చెత్తశుద్ధిపై కాన రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 



నరసరావుపేట, ఆగస్టు10: మునిసిపాలిటీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం(క్లాప్‌) కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించింది. క్లాప్‌ అమలులో మునిసిపాల్టీలు విఫలమవుతున్నాయి. ఈ పథకం లక్ష్యాలు ఘనంగా ఉన్నా ఆచరణ శూన్యమే. క్లాప్‌ అమలులో భాగంగా చేపట్టిన చెత్త రవాణా కేంద్రాల నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. వీటికి నిధుల కొరత వెంటాడుతోంది. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో రూ.10.15 కోట్ల వ్యయంతో చేపట్టిన చెత్త రవాణా కేంద్రాల నిర్మాణాలను చేపట్టారు. వీటి పనులు ప్రారంభించి 6 నెలలు గడిచినా ఒక్క కేంద్రం నిర్మాణం కూడా పూర్తి కాకపోవడం గమనార్హం.

మునిసిపాల్టీలలో పారిశుధ్య పనుల నిర్వహణలో పాత విధానాలకు స్వస్తిపలికి క్లాప్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగానే చెత్త పన్ను కూడా అమల్లోకి వచ్చింది. నూతన విధానంలో పారిశుధ్య పనులకు మునిసిపాల్టీలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. వ్యర్ధాల నిర్వహణ వ్యయాన్ని ప్రజల నుంచి వసూలుకు మునిసిపాల్టీలు సిద్ధమయ్యాయి. ఇంటింటికి రూ.60 చెత్త పన్ను వసూలు చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో చెత్తపన్ను వసూలు నామమాత్రంగా కూడా లేకపోవడంతో క్లాప్‌ భారం పూర్తిగా మునిసిపాల్టీలపై పడుతోంది. దీంతో ఆర్థిక వెతలను పురపాలక సంఘాలు ఎదుర్కొంటున్నాయి.  

 ఇంటింటి సేకరించిన వ్యర్ధాలను తరలించేందుకు చెత్త రవాణా కేంద్రాల నిర్మాణాన్ని అన్ని పురపాలక సంఘాల్లో చేపట్టారు. ఈ పనులు నత్తనడక  సాగుతున్నాయి. నెలలు గడుస్తున్నా పౌండేషన్‌ స్థాయి దాటలేదు. కొన్ని చోట్ల స్థలాలను గుర్తించి వాటిని చదును చేసి కొందరు అధికారులు చేతులు దులుపుకొన్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాచర్ల, వినుకొండ, పిడుగురాళ్ళ మునిసిపాల్టీలలో పనులు పునాదుల స్థాయి దాటాయి. మిగతా మునిసిపాల్టీలలో మట్టి పనుల స్థాయిలోనే నిలిచాయి. వీటిని నిర్మించకుండానే ఆటోలతో చెత్త సేకరణ చేస్తుండటంతో పాత పద్ధతిలోనే కొన్ని వీధుల్లో పడవేస్తూ తదుపరి కాంప్యాక్ట్‌ వాహనాల ద్వారా తరలిస్తున్నారు. ఆటోలతో చెత్త సేకరణ లక్ష్యాలను పారిశుధ్య విభాగం తుంగలో తొక్కుతోంది. 

 ఇంటికి నెలకు రూ.60 చెత్త పన్ను బాదుడును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం మునిసిపాల్టీలకు లక్ష్యాలను నిర్ధేచించి మరీ ఈ పన్నులు వసూలు చేయిస్తోంది. ప్రజల డబ్బుతోనే పారిశుధ్య పనులు నిర్వహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. క్లాప్‌ విధానం అమలులోకి వచ్చినా ఇంకా పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపడలేదని చెప్పవచ్చు. వీధుల్లో ఎక్కడిక్కడే వ్యర్ధాలు పేరుకుపోతున్నాయి. చెత్త పన్నుపై ఉన్న చిత్తశుద్ధి.. చెత్తశుద్ధిపై కానరాండంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


 

Updated Date - 2022-08-11T05:20:53+05:30 IST