మనోధైర్యమే కొవిడ్‌కు మందు

ABN , First Publish Date - 2020-08-09T09:54:45+05:30 IST

మనోధైర్యానికి మించిన మందులేదని ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు అన్నా రు. కొవిడ్‌ బారినపడి ఆసుపత్రుల్లో, గృహాల వద్ద ఉండి ..

మనోధైర్యమే కొవిడ్‌కు మందు

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : మనోధైర్యానికి మించిన మందులేదని ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు అన్నారు. కొవిడ్‌ బారినపడి ఆసుపత్రుల్లో, గృహాల వద్ద ఉండి వైద్యసేవలు పొందుతున్న పోలీస్‌ సిబ్బందితో  వీడియో కాన్ఫరెన్పు ద్వారా ఎస్పీ మాట్లాడి పరామర్శించారు.  విధుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పనిచేసి కరోనా బారిన పడిన వారు అధైర్యపడకుండా  ముందుకు సాగాలన్నారు. పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి  కుటుంబాలకు దూరంగా ఉండి విధులు నిర్వ హించి వైరస్‌బారిన పడ్డారన్నారు. 


ప్రతిఒక్కరూ కరోనా ను జయించి మళ్లీ విధుల్లో చేరాలని ఆకాక్షించారు.  కరోనా బారిన పడి గృహాల్లోనే ఉన్నవారికి వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసు కున్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో ఆరా తీశారు.  పోలీస్‌ ఆసుపత్రి డాక్టర్‌తో మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారికి మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎస్పీ తమతో మాట్లాడడం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, తాము త్వరలోనే కోలుకుని విధుల్లో చేరతామని కొవిడ్‌కు చికిత్స పొందు తున్న సిబ్బంది తెలిపారు. 


పోలీస్‌ విశ్రాంతి భవనం ప్రారంభం 

జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన పోలీస్‌ విశ్రాంతి భవనానాన్ని ఎస్పీ రవీంద్ర నాథ్‌బాబు శనివారం ప్రారంభించారు. పోలీస్‌ అధి కారులు, సిబ్బంది భవనం నిర్మాణానికి తమ వంతుగా  ఆర్థిక సహకారం అందించారని ఆయన అన్నారు.  పలువురు పోలీస్‌ అధికారులుపాల్గొన్నారు. 


 నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి

జిల్లాలోని 1988 బ్యాచ్‌కు చెందిన నలుగురు కాని స్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లగా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.  ఎం.నాగేశ్వరరావు, డి.అయ్యన్న, ఎం.అప్పారావు, కె.వి.వి. నాగరాజులకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. 

Updated Date - 2020-08-09T09:54:45+05:30 IST