గుడివాడ క్యాసినో ఛాలెంజ్.. అడ్డంగా దొరికిన కొడాలి నాని..!

ABN , First Publish Date - 2022-01-23T01:15:35+05:30 IST

గుడివాడలో క్యాసినో వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్‌ హాల్‌లో సంక్రాంతి

గుడివాడ క్యాసినో ఛాలెంజ్.. అడ్డంగా దొరికిన కొడాలి నాని..!

గుడివాడలో క్యాసినో వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి కొడాలి నానికి  చెందిన కె-కన్వెన్షన్‌ హాల్‌లో సంక్రాంతి సందర్భంగా క్యాసినో, ఇతర జూదక్రీడలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను కొడాలి నాని ఖండించారు. ‘నా రెండున్నర ఎకరాల కల్యాణ మండపంలో క్యాసినో, జూదం నిర్వహించినట్లు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా. పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా.’ ఇదీ కొడాలి నాని విసిరిన సవాల్‌. ఇది విన్న రాష్ట్ర ప్రజలంతా విస్తుపోయారు. 


రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే.. ఏం జరగబోతోంది? క్యాసినో విషయంలో కొడాలి నాని అడ్డంగా దొరికిపోయాడా? రాజీనామా, ఆత్మహత్య సవాళ్లు బూతు మంత్రి మెడకు చుట్టుకోబోతున్నాయా? నిరూపణకు సిద్ధం అంటున్న టీడీపీ, జనసేన పార్టీలు. నానిని అంత తేలిగ్గా వదులుతాయా? గుడివాడ క్యాసినో వ్యవహారంలో కేంద్ర సంస్థలు విచారణ జరుపుతాయా? గుడివాడ క్యాసినో ఛాలెంజ్‌లో అడ్డంగా దొరికిన కొడాలి నాని! సంక్రాంతి సంబరాల పేరిట గుడివాడలో ‘గోవా క్యాసినో’లను దించడం నిజం. అందుకు మంత్రికి చెందిన కె-కన్వెన్షన్‌ హాలు వేదిక కావడం నిజం! దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఆసక్తికర విషయాలను ఏబీఎన్ ది డిబెట్‌‌లో వీక్షించండి)

Updated Date - 2022-01-23T01:15:35+05:30 IST