రేపటి గుడివాడ Mahanadu వాయిదా

ABN , First Publish Date - 2022-06-28T19:54:50+05:30 IST

గుడివాడలో రేపు జరుగనున్న టీడీపీ(TDP) మహానాడు వాయిదా పడింది.

రేపటి గుడివాడ Mahanadu వాయిదా

అమరావతి: గుడివాడలో రేపు జరుగనున్న టీడీపీ(TDP) మహానాడు వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం, వాతావరణం అనుకూలంగా లేనందున కార్యక్రమం వాయిదా వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu) సూచించారు. గుడివాడలో రేపటి మహానాడు నిర్వహణపై మంగళవారం చంద్రబాబుతో ముఖ్యనేతలు సమీక్ష నిర్వహించారు. గుడివాడ మహానాడు నిర్వహించుకున్న తర్వాతే మరో కార్యక్రమం చేపడదామని ఈ సందర్భంగా అధినేత తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా గుడివాడ మహానాడు తదుపరి తేదీ ఖరారు చేయాలని నేతలకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2022-06-28T19:54:50+05:30 IST