12 ఏళ్ల తరువాత కటింగ్‌కు వెళ్లిన యువతి! మ్యూజియంకు విరాళం..!

ABN , First Publish Date - 2021-04-16T01:00:16+05:30 IST

పన్నెండేళ్ల తరువాత కటింగ్ చేయించుకున్న ఓ టీనేజ్ యువతి..ఆ కేశాలను మ్యూజియంకు విరాళంగా ఇచ్చేందుకు నిర్ణయించింది. అదేంటి.. ఇంతకాలం జుట్టు కత్తిరించుకోకపోతే జుట్టు పెద్దగా పెరిగిపోదూ అని అంటారా..?

12 ఏళ్ల తరువాత కటింగ్‌కు వెళ్లిన యువతి! మ్యూజియంకు విరాళం..!

ఇంటర్నెట్ డెస్క్: పన్నెండేళ్ల తరువాత కటింగ్ చేయించుకున్న ఓ టీనేజ్ యువతి..ఆ కేశాలను మ్యూజియంకు విరాళంగా ఇచ్చేందుకు నిర్ణయించింది. అదేంటి.. ఇంతకాలం జుట్టు కత్తిరించుకోకపోతే జుట్టు పెద్దగా పెరిగిపోదూ అని అంటారా..? మీరన్నది కరెక్టే..! అయితే.. ఈ కారణంగానే ఆమెకు ఓ అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేశాలు గల టీనేజ్ యువతిగా ఆమె ప్రపంచ రికార్డు సృష్టించింది. 2018 నుంచి 2020 వరకూ వరుసగా మూడు సంవత్సరాలు ఈ రికార్డు ఆమె పేరే ఉంది. ఈ టీనేజర్ పేరు నీలాంశీ పటేల్, గుజరాత్ వాస్తవ్యురాలు. తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు కటింగ్ చేయంచుకోకూడదని ఆమె నిర్ణయించుకుంది. అప్పటి కటింగ్ నీలాంశీకి నచ్చకపోవడమే దీనికి కారణం. నాటి నుంచీ నేటి వరకూ ఆమె జుట్టు కత్తిరించుకోలేదు. ప్రస్తుతం ఆమె వయసు 18 ఏళ్లు. అంటే..ఏకంగా 12 ఏళ్ల పాటు ఆమె క్షవరశాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె జుట్టు అలా పెరుగుతూ పోయింది. 2020 జులైలో చివరిసారిగా 6 అడుగుల 6.7 అంగుళాల పొడవున్న జుట్టుతో ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. 


అయితే.. ఇటీవల ఆమె తన పొడవాటి జుట్టుకు గుడ్‌‌బై చెప్పేసింది. అంతేకాకుండా.. కత్తిరించిన జుట్టును మ్యూజియంకు ఇచ్చేసేందుకు కూడా నిర్ణయించింది. జుట్టును మ్యూజియంలో ఉంచడమే సబబని.. ఇటువంటి రికార్డులు మరిన్ని నెలకొల్పేలా ఇది ఎందరికో స్ఫూర్తినిస్తుందని ఆమె తల్లి వ్యాఖ్యానించారు. నిలాంశీ తల్లి కూడా తన కేశాలను కత్తిరించుకుని జుట్టుకు క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చేశారు. నిలాంశీ జుత్తు కత్తిరించుకుంటుండగా తీసిన వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. ఈ ఆసక్తికర వీడియో మీ కోసం...!



Updated Date - 2021-04-16T01:00:16+05:30 IST