కోడిగుడ్లతో గిన్నిస్‌ రికార్డు!

ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST

షాపు నుంచి ఒక డజను కోడిగుడ్లు తీసుకురమ్మంటే ఎక్కడ పడిపోతాయోనని హైరానా పడిపోతాం. కానీ ఈ వ్యక్తి ఏకంగా నెత్తిపై..

కోడిగుడ్లతో గిన్నిస్‌ రికార్డు!

షాపు నుంచి ఒక డజను కోడిగుడ్లు తీసుకురమ్మంటే ఎక్కడ పడిపోతాయోనని హైరానా పడిపోతాం. కానీ ఈ వ్యక్తి ఏకంగా నెత్తిపై 735 కోడిగుడ్లు మోసి అందరినీ ఆశ్చర్యంలో ముంతెత్తాడు. తన ప్రతిభతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కాడు.

  1.  పశ్చిమ ఆఫ్రికాకు చెందిన గ్రెగరీ డ సిల్వాకు స్థానికంగా 
  2. ‘ఎగ్‌మ్యాన్‌’ అని పేరు. కోడిగుడ్లు నెత్తిన పెట్టుకుని ఫీట్స్‌ చేయడం వల్ల ఆయనకు ఆ పేరు స్థిరపడింది. 
  3.  ఇటీవల ఆయన నెత్తిపై ఒక టోపీలాంటి దాంట్లో 735 గుడ్లు పెట్టి కిందపడిపోకుండా చేతులు వదిలేసి మరీ ఫీట్‌ చేశాడు. ఇంకేం... ఆయన చేసిన ఫీట్‌కు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు సైతం ఫిదా అయిపోయారు.

Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST