
Gujarat Assemblyలో బిల్లు ఆమోదం
అహ్మదాబాద్ : పట్టణ ప్రాంతాల్లో సంచరించే పశువుల నియంత్రణ బిల్లును గుజరాత్ అసెంబ్లీ ఆమోదించింది.కొత్త బిల్లు ప్రకారం ఇప్పుడు పశువుల యజమానులు పశువులను పెంచుకోవడానికి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. కొత్త బిల్లులోని నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో జంతువుల రిజిస్ట్రేషన్,ట్యాగింగ్ తప్పనిసరి చేయాలి.కొత్త చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజులలోపు కాపరులు లైసెన్స్ పొందవలసి ఉంటుంది.పశువుల పెంపకందారులు ఉంచే అన్ని పశువులకు లైసెన్స్ పొందిన 15 రోజులలోపు ట్యాగ్ చేయాలి.నిర్దిష్ట పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో పశువుల రాకపోకలను నియంత్రించాలనే నిబంధన కూడా ఉంది.ప్రతిపాదిత చట్టాన్ని ఉల్లంఘిస్తే పశువుల యజమానులకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే బిల్లును గుజరాత్ అసెంబ్లీ గురువారం ఆమోదించింది.
ఈ బిల్లుకు వ్యతిరేకంగా తాము ఆందోళన చేస్తామని మల్ధారీ ఏక్తా సమితి హెచ్చరించింది.పశువులు చనిపోయినప్పుడు లైసెన్స్ పొందిన వ్యక్తి కళేబరాన్ని పర్యావరణానికి హాని కలిగించని విధంగా, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారవేయాలి.ప్రతిపాదిత చట్టంలోని నిబంధనల ప్రకారం ఇన్స్పెక్టర్ లేదా అప్పీలేట్ అథారిటీ తనిఖీలు చేయవచ్చు.అంటువ్యాధులు వ్యాప్తి చెందే పక్షంలో లైసెన్స్ పొందిన ప్రాంగణంలో ఉన్న పశువులన్నింటిని తొలగించమని ఇన్స్పెక్టర్ ఎప్పుడైనా నిర్దేశించవచ్చు.
ఇవి కూడా చదవండి