వాడు నా కొడుకు.. కాదు, నా కొడుకు.. మహిళ భర్త, ప్రియుడి మధ్య కొట్లాట.. కోర్టును ఆశ్రయిస్తే ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-05T19:41:11+05:30 IST

వివాహేతర సంబంధం ఆ దంపతుల మధ్య చిచ్చుపెట్టింది.. ఆ విషయమై కొన్ని రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి..

వాడు నా కొడుకు.. కాదు, నా కొడుకు.. మహిళ భర్త, ప్రియుడి మధ్య కొట్లాట.. కోర్టును ఆశ్రయిస్తే ఏం జరిగిందంటే..

వివాహేతర సంబంధం ఆ దంపతుల మధ్య చిచ్చుపెట్టింది.. ఆ విషయమై కొన్ని రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి.. దీంతో కొడుకుని తీసుకుని ఆ మహిళ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.. ప్రియుడితోనే కలిసి ఉంటోంది.. భర్తకు విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.. దీంతో తన కొడుకును తనకు అప్పగించాలని భర్త గుజరాత్ హైకోర్టులో కేసు వేశాడు.. దానికి ప్రతిగా ఆ బిడ్డ తనకు పుట్టిన వాడే అంటూ ప్రియుడు కూడా పిటిషన్ వేశాడు.. దీంతో కోర్టు పెటర్నిటీ టెస్ట్‌కు ఆదేశించింది. 


గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌కు చెందిన భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య కొడుకుతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తన గురించి వెతికితే బిడ్డను చంపి తాను చనిపోతానని లెటర్ రాసి పెట్టి వెళ్లిపోయింది. దీంతో భర్త తన కొడుకు కోసం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి.. వేరొక వ్యక్తితో కలిసి జీవిస్తోందని, అతనికి క్రిమినల్ రికార్డు ఉందని, కాబట్టి తన కొడుకును తనకే అప్పగించాలని కోరాడు. ఆ ఆరోపణలను భార్య, ఆమె ప్రియుడు ఖండించారు. తమ మధ్య వివాహేతర సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే తన భార్య తనకు విడాకులు ఇచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. 


ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఆ బాబును తండ్రికే అప్పగించాలని సూచించింది. దాంతో అతడి భార్య ప్రియుడు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తమ మధ్య వివాహేతర సంబంధం లేదని బుకాయించిన ప్రియుడు.. హఠాత్తుగా మాట మార్చాడు. ఆ బిడ్డకు తానే తండ్రినని పేర్కొంటూ పెటర్నిటీ టెస్ట్ రిపోర్టును కోర్టుకు సమర్పించాడు. దీంతో కోర్టు అయోమయంలో పడింది. మహిళ భర్తతో పాటు ప్రియుడికి కూడా గాంధీనగర్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో పెటర్నిటీ టెస్ట్‌లు చేయాలని ఆదేశించింది. రిపోర్టులు వచ్చేందుకు ఆరు వారాల సమయం పట్టే అవకాశముంది. 

Read more