Gujarat Elections: 10 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా

ABN , First Publish Date - 2022-08-02T20:30:16+05:30 IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంతో ఉత్సాహంతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ...

Gujarat Elections: 10 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా

గాంధీనగర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంతో ఉత్సాహంతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తుదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ (Gujarat Assembly) ఎన్నికల్లో పోటీచేసే 10 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా (First list)ను మంగళవారం విడుదల చేసింది. భీమాభాయ్ చౌదరి, జగ్మల్ వాలా, అర్జున రథ్వా, సాగర్ రబరి, వశ్రామ్, రామ్ ధనుక్, శివపాల్ బరసియా, సునీల్ వాఘాని, రాజేంద్ర సోలంకి, ఓంప్రకాష్ తివారీలను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. గుజరాత్‌లో 111 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.


ఐదేళ్లలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపిస్తే రాబోయే ఐదేళ్లలో ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం కల్పిస్తామని, అందరికీ ఉద్యోగాలు కల్పించేంత వరకూ నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని కేజ్రీవాల్ ప్రీపోల్ హామీ ఇచ్చారు. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ప్రశ్నాపత్నం లీక్ కాకుండా చూడటంతో పాటు ఇందుకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కల్పిస్తామని ఇప్పటికే కేజ్రీవాల్ ఓటర్లకు భరోసా ఇచ్చారు.

Updated Date - 2022-08-02T20:30:16+05:30 IST