Stray cow attack: మాజీ ఉప ముఖ్యమంత్రిపై దూసుకెళ్లిన వీధి ఆవు

ABN , First Publish Date - 2022-08-13T22:31:36+05:30 IST

గుజరాత్‌లోని మెహ్‌సానాలో శనివారం జరిగిన ''హర్ ఘర్ తిరంగా'' యాత్రలో అపశ్రుతి..

Stray cow attack: మాజీ ఉప ముఖ్యమంత్రిపై దూసుకెళ్లిన వీధి ఆవు

మెహసానా: గుజరాత్‌లోని మెహ్‌సానాలో శనివారం జరిగిన ''హర్ ఘర్ తిరంగా'' యాత్రలో  (Har Ghar tiranga) అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాలీకి సారథ్యం వహిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌ (Nitin patel) పైకి వీధుల్లో సంచరించే ఒక ఆవు  (Stray Cow) దూసుకువెళ్లింది. జనంలోకి దూసుకువచ్చిన ఆ ఆవు పలువురిని నెట్టుకుంటూ ఆయనపైకి  దూసుకువెళ్లింది. దాంతో నితిన్‌తో పాటు పాటు కొందరు కిందపడిపోయారు. ఈ ఘటన మొత్తం కెమెరాకు చిక్కింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి సరల్ పటేల్ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇందులో నితిన్ పటేల్‌తో పాటు పలువురు కిందపడటం కనిపిస్తోంది.


కాగా, గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత డాక్టర్ టోహిద్ అలంఖాన్ ఈ ఘటనపై ఒక ట్వీట్ చేశాడు. ఎడమకాలికి గాయమై వీల్‌చైర్‌లో ఉన్న నితిన్ పటేల్ ఫోటోను ఆయన ట్వీట్‌కు జోడించారు. ఈ ప్రమాదానికి బాధ్యులెవరు? అంటూ ఆప్ నేత ప్రశ్నించారు. 75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఇంటింటా త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పిలుపునిచ్చింది. హర్ ఘర్ తిరంగా ప్రచారం చేపట్టినప్పటి నుంచి 20 కోట్ల జాతీయ జెండాలు అందుబాటులోకి వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-08-13T22:31:36+05:30 IST