హైకోర్టు కీలక తీర్పు: తన కుమారుడిని అత్తమామలకు అప్పగించాలంటూ NRI మహిళకు ఆదేశాలు..!

ABN , First Publish Date - 2022-06-19T02:05:20+05:30 IST

తన పన్నెండేళ్ల కుమారుడిని అత్తమామలకు అప్పగించాలంటూ ఓ NRI మహిళను గుజరాత్ హైకోర్టు తాజాగా ఆదేశించింది.

హైకోర్టు కీలక తీర్పు: తన కుమారుడిని అత్తమామలకు అప్పగించాలంటూ NRI మహిళకు ఆదేశాలు..!

అహ్మదాబాద్: తన పన్నెండేళ్ల కుమారుడిని అత్తమామలకు అప్పగించాలంటూ ఓ NRI మహిళను గుజరాత్ హైకోర్టు తాజాగా ఆదేశించింది.  తాతా బామ్మల దగ్గరే ఉంటానన్న చిన్నారి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాలుడు గత ఆరేళ్లుగా తన తాతాబామ్మల దగ్గరే నివసిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్న అతడి తల్లి కొన్నేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె అత్తమామల కథనం ప్రకారం.. బిడ్డ పుట్టిన తరువాత తన భర్తను వదిలిపెట్టేసిన కోడలు మరో వ్యక్తితో జీవించసాగింది. అయితే.. అతడితో విడిపోయిన తరువాత ఇండియాకు వచ్చిన కోడలు తమ వద్ద నుంచి బాలుడిని తీసుకెళ్లిపోయింది. 


ఈ క్రమంలోనే ఆ వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించారు. తమ కోడలు కొన్నేళ్ల క్రితమే తన భర్తనూ, కుమారుడిని వదిలిపెట్టివెళ్లిపోయిందని ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా ఆమె డెయిరీని కూడా కోర్టుకు సమర్పించారు. మరోవైపు.. బాలుడికి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో సదరు మహిళ తన కుమారిడితో సహా భారత్‌కు తిరిగిరావాలని కోర్టు ఆదేశించింది. పరీక్షల తరువాత సెలవుల్లో మాత్రం కుమారుడిని ఆమె తనతో తీసుకెళ్లవచ్చని పేర్కొంది. ఇదిలా ఉంటే.. తన కుమారుడిని తన బంధువలకు అప్పగించాలంటూ ఎన్నారై మహిళ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఇక బాలుడి తండ్రి కూడా ఇండియాకు రాలేని పరిస్థితిలో ఉన్న విషయాన్ని న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బాలుడు తాను తాతాబామ్మల వద్దే ఉంటానని చెప్పడంతో వారికే అతడి కస్టడీని ఇచ్చారు.  అయితే..ఇతర చట్టబద్ధమైన మార్గాల్లో కుమారుడి కస్టడీకి ప్రయత్నాలు చేసేందుకు కోర్టు ఆమెకు అనుమతిచ్చింది. 



Updated Date - 2022-06-19T02:05:20+05:30 IST