గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మెవానీ అరెస్టు

ABN , First Publish Date - 2022-04-22T06:59:10+05:30 IST

ప్రధాని మోదీపై అనుచిత ట్వీట్‌ చేశారన్న ఆరోపణలపై గుజరాత్‌

గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మెవానీ అరెస్టు

  • ప్రధానిపై ‘గాడ్సే’ ట్వీట్‌.. 


కోక్రాఝర్‌, ఏప్రిల్‌ 21: ప్రధాని మోదీపై అనుచిత ట్వీట్‌ చేశారన్న ఆరోపణలపై గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మెవానీని అసోం పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో ఆయన్ను అరెస్టు చేసి విమానంలో గువాహటీకి తరలించారు. అక్కడి నుంచి కోక్రాఝర్‌ పోలీసు స్టేషన్‌కు రోడ్డుమార్గంలో తీసుకెళ్లారు. ‘ప్రధాని మోదీ గాడ్సే ను దేవుడిగా భావిస్తున్నారు’ అని మెవానీ ట్వీట్‌ చేశారు. గుజరాత్‌ ప్రము ఖ దళిత నేత అయిన మెవానీ ఇటీవల కాంగ్రె్‌సకు మద్దతు ప్రకటించారు.


Updated Date - 2022-04-22T06:59:10+05:30 IST