ఐపీఎల్ 2022 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్

ABN , First Publish Date - 2022-05-25T05:17:28+05:30 IST

ఐపీఎల్ 2022(IPL2022) క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఉత్కంఠ భరిత విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.

ఐపీఎల్ 2022 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్

కోల్‌కతా : ఐపీఎల్ 2022(IPL2022) క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో  గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఉత్కంఠ భరిత విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.  రాజస్థాన్ రాయల్స్(Rajastan Royals) నిర్దేశించిన  189 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో చేధించింది. నాలుగవ వికెట్‌కు డేవిడ్ మిల్లర్, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఇద్దరూ చక్కటి భాగస్వామ్యంతో గుజరాత్‌ను విజయ తీరాలకు చేర్చారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు రాజస్థాన్ కెప్టెన్ సంజూ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అయితే సమయోచితంగా బౌలింగ్ చేసిన మెక్‌కే 19వ ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ ఏమైనా మలుపు తిరుగుతుందేమో అనిపించింది. చివరి ఓవర్లో 16 కావాల్సి ఉండగా ప్రసిద్ కృష్ణ వేసిన ఈ ఓవర్‌ మొదటి 3 బంతులను డేవిడ్ మిల్లర్ భారీ సిక్సర్లుగా మలిచాడు. దీంతో గుజరాత్ టైటాన్స్‌ని రాజసంగా ఫైనల్‌ల్లో అడుగుపెట్టింది. 


గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్:

వృద్ధిమాన్ సాహా (0), శుభ్‌మన్‌ గిల్(35), మాథ్యూ వేడ్(35), హార్ధిక పాండ్యా(40), డేవిడ్ మిల్లర్(68) చొప్పున పరుగులు చేశారు.


రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ : ట్రెంట్ బోల్ట్ 1, మెక్‌కే 1 చొప్పున వికెట్లు తీశారు. 1 రనౌట్ ఉంది.


రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్:

జైస్వాల్ (3), జాస్ బట్లర్(89), సంజూ శాంసన్(47), పడిక్కల్(28), హెట్మెయర్ (4), రియాన్ పరాగ్(4, రనౌట్), అశ్విన్ (2 నాటౌట్), బోల్ట్(0 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 186-6 స్కోర్ చేసింది.


గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ :

మొహమ్మద్ షమీ, యస్ దయాల్, సాయి కిశోర్ , హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 2 రనౌట్లు ఉన్నాయి.

Updated Date - 2022-05-25T05:17:28+05:30 IST