IPL: టాప్-2 జట్ల మధ్య ఫైట్.. టాస్ గెలిచిన Gujarat Titans

ABN , First Publish Date - 2022-05-11T00:47:55+05:30 IST

ఐపీఎల్‌లో నేడు ఆసక్తికర పోరు జరగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్

IPL: టాప్-2 జట్ల మధ్య ఫైట్.. టాస్ గెలిచిన Gujarat Titans

పూణె: ఐపీఎల్‌లో నేడు ఆసక్తికర పోరు జరగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ప్లే ఆఫ్స్‌కు నేరుగా చేరుకుంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన బలంతో ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోటీ ప్రేక్షకులకు పసందైన విందును పంచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 11 చొప్పున మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు అందుకున్నాయి. అయితే, లక్నో నెట్ రన్‌రేట్ భారీగా ఉండడంతో అగ్రస్థానంలో ఉంది.


గుజరాత్ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. లాకీ ఫెర్గ్యూసన్ స్థానంలో మాథ్యూవేడ్, సాయి సుదర్శన్ స్థానంలో సాయి కిషోర్, ప్రదీప్ సంగ్వాన్ స్థానంలో యశ్ దయాళ్ జట్టులోకి వచ్చారు.  లక్నో జట్టు మాత్రం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. రవి బిష్ణోయ్ స్థానంలో కరణ్ శర్మ జట్టులోకి వచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసి అత్యధిక మ్యాచుల్లో విజయం సాధించిన జట్టుగా లక్నోకు మంచి రికార్డు ఉంది. ఏడుసార్లు ఆ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి లక్ష్యాలను నిర్దేశించగా, ఆరుసార్లు విజయం సాధించింది. ఈ సీజన్‌లో బెస్ట్ చేజింగ్ జట్టుగా గుజరాత్‌కు ట్రాక్ రికార్డు ఉంది. లక్ష్య ఛేదనలో ఆ జట్టు ఆరు మ్యాచుల్లో ఐదుసార్లు విజయం సాధించింది.

Read more