పీరియాడిక్‌ టేబుల్‌ను గుక్కతిప్పుకోకుండా..!

ABN , First Publish Date - 2021-07-07T06:12:23+05:30 IST

మూలకాల పట్టిక గురించి అడిగితే హైస్కూల్‌ విద్యార్థులు సైతం తటపటాయిస్తారు. అలాంటిది ఐదేళ్ల చిన్నారి అలవోకగా, గుక్కతిప్పుకోకుండా పీరియాడిక్‌ టేబుల్‌ గురించి మొత్తం చెప్పేస్తుంది.

పీరియాడిక్‌ టేబుల్‌ను గుక్కతిప్పుకోకుండా..!

మూలకాల పట్టిక గురించి అడిగితే హైస్కూల్‌ విద్యార్థులు సైతం తటపటాయిస్తారు. అలాంటిది ఐదేళ్ల చిన్నారి అలవోకగా, గుక్కతిప్పుకోకుండా పీరియాడిక్‌ టేబుల్‌ గురించి మొత్తం చెప్పేస్తుంది.

తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ఐదేళ్ల నిపుణ  ఘనత ఇది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఈ చిన్నారి ఐదేళ్ల వయసులోనే పీరియాడిక్‌ టేబుల్‌లోని అన్ని మూలకాలు, వాటి పరమాణు సంఖ్యల గురించి పొల్లుపోకుండా చెప్పేస్తుంది.

అది కూడా 3 నిమిషాల 53 సెకన్లలోనే 118 మూలకాల పేర్లు, వాటి పరమాణుసంఖ్యలు చెబుతుంది. ఈ చిన్నారి తన ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించింది. 

Updated Date - 2021-07-07T06:12:23+05:30 IST