ఉత్తరాంధ్రకు ‘గులాబ్’ భయం

Sep 25 2021 @ 16:54PM

విశాఖ: ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు ప్రమాదం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా మారి ఉత్తరాంధ్రలోని విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్‌ల మధ్య ఈనెల 26న తీరం దాటే అవకాశముంది. ఈ తుపానుకు పాకిస్థాన్‌ పెట్టిన ‘గులాబ్‌’ అనే పేరును ఖరారుచేసే అవకాశాలున్నాయి. నిజానికి  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి శుక్రవారం వాయుగుండంగా మారింది. సాయంత్రం 5.30 గంటలకు తూర్పు-మధ్య బంగాళాఖాతం మీదుగా ఉంది. గోపాలపుర్‌కు ఆగ్నేయంగా 670 కి.మీ దూరంలో, కళింగపట్నానికి తూర్పుగా 740 కి.మీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. శనివారం ఉదయానికి తుపానుగా మారొచ్చు. దీనితో ఈ నెల 27 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.