నన్నే ‘నువ్వు’ అంటావా..?!

ABN , First Publish Date - 2020-10-27T10:16:09+05:30 IST

‘నువ్వు’ అని సంబోధించిన పాపానికి గుల్బార్గాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ సతీష్‌, అతడి అనుచరులు ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు

నన్నే ‘నువ్వు’ అంటావా..?!

 గుల్బర్గా గ్యాంగ్‌స్టర్‌ వీరంగం

 సైదాబాద్‌లో యువకుడిపై దాడి

 అనుచరులతో కలిసి హల్‌చల్‌

 అక్కడ హత్య, కిడ్నాప్‌,  దోపిడీ కేసులలో నిందితుడు

 ఎన్‌కౌంటర్‌ భయంతో అజ్ఞాతవాసం


సైదాబాద్‌, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): ‘నువ్వు’ అని సంబోధించిన పాపానికి గుల్బార్గాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ సతీష్‌, అతడి అనుచరులు ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసుల ముందే ‘నాలుగు హత్యలు చేశాను.. నిన్ను అలాగే చేస్తా’ అని బెదిరించాడు. ఈ ఘటనపై బాధితుడి భార్య అర్ధరాతి సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏమైందో ఏమో సోమవారం ఉదయమే పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు వాపసు తీసుకుంటానని పోలీసులను వేడుకుంది.  


కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ సుంకరి సతీష్‌ అలియాస్‌ మార్కెట్‌ సతీష్‌(38) అక్కడి పోలీ్‌సస్టేషన్లలో హత్య, కిడ్నాప్‌, దోపిడీతోపాటు ఇతర కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తారనే భయంతో ఏడు నెలల క్రితం అక్కడి నుంచి పారిపోయి నగరానికి వచ్చాడు. సైదాబాద్‌ పూసల బస్తీలో తన అనుచరులతో కలిసి అజ్ఞాతజీవితం గడుపుతున్నాడు. ఇక్కడి వారితో బంధుత్వాలు ఉండటంతో నివాసం నగరానికి మార్చి, పూసల బస్తీలో తమ పూర్వీకులు ఉండే నివాసాన్ని కొనుగోలు చేశాడు. భారీ భవన నిర్మాణం చేపడుతున్నాడు. 


ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి దసరా ఉత్సవాల సందర్భంగా సైదాబాద్‌ పూసల బస్తీకి చెందిన పొదిల రాజేశ్‌కుమార్‌(25) కుటుంబసభ్యులతో కలసి శివాంజనేయస్వామిని దర్శించుకుని, ఆలయం ముందు నిలబడ్డాడు. ఈ క్రమంలో రెండు బైక్‌లపై కొందరు(గ్యాంగ్‌స్టర్‌ సతీష్‌ అనుచరులు) వచ్చి సతీ్‌షకు దసరా శుభాకాంక్షలు చెప్పారు. 


ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్‌ సతీ్‌షను రాజేశ్‌ ‘నువ్వు’ అంటూ సంబోధించాడు. దీంతో ఆగ్రహించిన సతీష్‌, అతడి అనుచరులు రిత్విక్‌.. రాజే్‌షకుమార్‌పై దాడి చేశారు. సతీష్‌, రిత్విక్‌ ఇంటికి వెళ్లి కత్తి, రాడ్లు తీసుకువచ్చి మరోసారి దాడికి యత్నించారు. ఆ సమయంలో పోలీసులు అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో సతీష్‌ ‘నాలుగు హత్యలు చేశాను. మిమ్నులను కూడా చేస్తా’ అని పోలీసుల ముందే బెదిరించాడని బాధితులు తెలిపారు.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజే్‌షను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 


ఘటన జరిగిన వెంటనే బాధితుడి భార్య అర్ధరాత్రి సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న సతీష్‌, అతడి అనుచరులు బాధిత కుటుంబాన్ని బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, రాజేశ్‌ భార్య సోమవారం ఉదయం ఆరు గంటలకే సైదాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు వాపస్‌ తీసుకుంటామని పోలీసులను వేడుకుంది. 


పోలీసుల తీరుపై అనుమానాలు

రాజేశ్‌పై దాడి జరిగినట్లు సమాచారం అందుకున్న పెట్రోలింగ్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నా, సరైన రీతిలో స్పందించలేదని ఆరోపణలు వస్తున్నాయి. హత్య చేస్తానని గ్యాంగ్‌స్టర్‌ సతీష్‌ పోలీసుల ముందు బెదిరించినా వారు ప్రేక్షక పాత్ర పోషించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులను వెళ్లిపోవాలంటూ సతీష్‌ వారికి బహిరంగంగానే డబ్బులు ఇచ్చాడని విమర్శలు వస్తున్నాయి. మొదట గ్యాంగ్‌స్టర్‌ సతీ్‌షను అదుపులో తీసుకుని వదిలేయడంపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. 


కేసు నమోదు

దాడి కేసులో మొదట అదుపులోకి తీసుకుని వదిలివేసిన గ్యాంగ్‌స్టర్‌ సతీష్‌ నేర చరిత్ర తెలుసుకున్న సైదాబాద్‌ పోలీసులు కలవరపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన ఘటనపై సైదాబాద్‌ పోలీసులు గ్యాంగ్‌స్టర్‌ సతీష్‌, అతడి అనుచురుడు రిత్విక్‌పై కేసు నమోదు చేశారు. 


సుమారు ఏడు నెలలుగా పూసలబస్తీలో ఉంటున్న సతీష్‌, అతడి అనుచరుల వ్యవహారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సతీష్‌ వ్యవహారంపై గుల్బర్గా పోలీసులకు సమాచామందించారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ సతీ్‌షపై మహారాష్ట్ర ఔరంగబాద్‌లో సైతం రౌడీషీట్‌ నమోదై ఉన్నట్లు తెలిసింది.  


ఎన్‌కౌంటర్‌ భయంతో నగరానికి..

గ్యాంగ్‌స్టర్‌ సతీష్‌ కర్ణాటక పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తారన్న భయంతో నగరంలో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్‌ ప్రధాన సహచరుడు మల్లికార్జున్‌ను కర్ణాటకలోని కలబురిగి నగర శివార్లలో గతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్‌ సతీష్‌ గుల్బర్గా నుంచి నగరానికి పారిపోయి వచ్చినట్లు సమాచారం. సతీష్‌ కోసం కర్ణాటక పోలీసులు రెండేళ్లుగా జల్లెడపడుతున్నట్లు తెలుస్తోంది. సతీ్‌షపై హత్య, కిడ్నాప్‌, దోపిడీలకు సంబంధించి 23 కేసులు పెండింగ్‌ ఉన్నట్లు సమాచారం. గతంలో వివిధ కేసులలో జైలులో ఉండి అనుచరుల ద్వారా నేరస్రామాజ్యాన్ని విస్తరించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-10-27T10:16:09+05:30 IST