గల్ఫ్‌ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-12-03T05:14:55+05:30 IST

మామడ మండలకేంద్రంలో గల్ఫ్‌ భరోసా యాత్రను స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు. గల్ఫ్‌ కంపెనీల నుంచి జీతం బకాయిలు రాబట్టడం గురించి అవగాహనను గల్ఫ్‌ భరోసా యాత్ర లో భాగంగా మామడ మండల కేంద్రంలో గల్ఫ్‌ నుంచి వాపస్‌ వచ్చిన వలస కార్మికులకు వివరిస్తూ.. అవగాహన, చైతన్య కార్యక్రమం నిర్వహించారు.

గల్ఫ్‌ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
మామడలో మాట్లాడుతున్న మంద భీంరెడ్డి

మామడలో గల్ఫ్‌ భరోసా యాత్ర

మామడ, డిసెంబరు 2: మామడ మండలకేంద్రంలో గల్ఫ్‌ భరోసా యాత్రను స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు. గల్ఫ్‌ కంపెనీల నుంచి జీతం బకాయిలు రాబట్టడం గురించి అవగాహనను గల్ఫ్‌ భరోసా యాత్ర లో భాగంగా మామడ మండల కేంద్రంలో గల్ఫ్‌ నుంచి వాపస్‌ వచ్చిన వలస కార్మికులకు వివరిస్తూ.. అవగాహన, చైతన్య కార్యక్రమం నిర్వహించారు. గల్ఫ్‌ దేశాల నుంచి వాపస్‌ వచ్చినవారు జీతం బకాయిలు మరియు బోనస్‌, పీఎఫ్‌, గ్రాట్యుటీ లాంటి ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ బెనిఫిట్స్‌ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) రాబట్టుకోవడం ఎలా? అనే విషయాలపై ఈ కార్యక్రమంలో వివరించారు. జస్టిస్‌ ఫర్‌ వేజ్‌ తెఫ్ట్‌ అనే నినాదంతో జీతం దొంగతనం గురించి న్యాయ పోరాటానికి అంతర్జాతీయ సంస్థలతో తాము సంప్రదిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి వివరిం చారు. ఆ తర్వాత స్వదేశ్‌ పరికిపండ్ల ప్రవాసి మిత్రా లేబర్‌ యూనియన్‌ అధ్యక్షు డు మాట్లాడుతూ వేతన దొంగతనాలకు పాల్పడిన గల్ఫ్‌ యాజమాన్యాల నుండి తక్షణ న్యాయ వ్యవస్థ, అంతర్జాతీయ న్యాయవాదులతో, ప్రపంచ కార్మిక సంఘా లతో, ఎంబాసిల సహకారంతో ప్రవాసి మిత్రా లేబర్‌ యూనియన్‌ వాపస్‌ వచ్చిన కార్మికుల నుంచి సాక్షదారాలు, రికార్డులను తీసుకొని వేతన బకాయిలను తిరిగి కార్మికులకు ఇప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విదేశీ లేబర్‌ కోర్టులలో న్యాయ పోరాటానికి కావలసిన లీగల్‌ ఎయిడ్‌ (న్యాయ సహాయం) అందించ డానికి తమ సంస్థ కృషి చేస్తుందని, సలహాలు, సహాయం కోసం ప్రవాసి మిత్రా హెల్ప్‌లైన్‌ నెం.9491613129, 7815837704 ద్వారా సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మామడ సర్పంచ్‌ హన్మాగౌడ్‌ పాల్గొని తిరిగి వచ్చిన గల్ఫ్‌ కార్మికుల వేతన బకాయిలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడెం, జన్నారం, ఖానాపూర్‌, నిర్మల్‌, మండలాల నుంచి కరోనా కారణంగా వాపస్‌ వచ్చిన కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:14:55+05:30 IST