అమరావతి పరిరక్షణకు గల్ఫ్ ప్రవాసాంధ్రుల సంఘీభావం

ABN , First Publish Date - 2021-12-03T01:39:03+05:30 IST

అమరావతి పరిరక్షణ ఉద్యమానికి అన్ని వర్గాలతో పాటు విదేశాలలో ఉంటున్న ప్రవాసాంధ్రులు కూడా సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి పరిరక్షణకు గల్ఫ్ ప్రవాసాంధ్రుల సంఘీభావం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అమరావతి పరిరక్షణ ఉద్యమానికి అన్ని వర్గాలతో పాటు విదేశాలలో ఉంటున్న ప్రవాసాంధ్రులు కూడా సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయులు తమ వంతుగా ముందుకు వచ్చి అమరావతికు అండగా నిలుస్తున్నారు. బహ్రెయిన్‌లో పని చేస్తున్న ప్రవాసాంధ్రులు టి. హరిబాబు, వి. రఘునంద బాబు, ఎ.వి.రావు, కె. ఆశోక్‌ల అధ్వర్యంలో రెండు లక్షల రూపాయాలు విరాళాలుగా సేకరించిం చేసి గురువారం వాసుదేవ రావు ద్వారా అమరావతి పరిరక్షణ సమితికి అందజేసారు. ఇతర ప్రవాసాంధ్రులు కూడా తమకు తోచిన విధంగా విరాళాలు అందజేసారు. కువైత్‌లోని ప్రవాసాంధ్రులు కూడా ఈ విషయంలో అందరికంటే ముందు ఉన్నారు. కువైత్‌లో ఉంటున్న జ్యోత్స్న గతంలో భారీ మోత్తంలో విరాళమివ్వడమే కాకుండా భారత్‌కు వచ్చి స్వయంగా పాదయాత్రలో పాల్గొన్నారు. కువైత్‌కు చెందిన పిడికిటి శ్రీనివాస చౌదరి, పేరం రమణలు ఒక లక్ష రూపాయాలు విరాళంగా ఇచ్చారు. ​దుబాయిలో ప్రవాసాంధ్ర ప్రముఖులు ఖాదర్ బాషా, విశేశ్వరరావు, నిరంజన్, రవికిరణ్‌లు కూడా తమకు తోచిన విధంగా అమరావతి పరిరక్షణ ఉద్యమానికి తోడ్పాటునందిస్తున్నారు.

Updated Date - 2021-12-03T01:39:03+05:30 IST