Americaలో రెండు చోట్ల కాల్పుల కలకలం.. ఈ ఘటనలపై పోలీసులు ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-07-25T17:09:11+05:30 IST

గన్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన అగ్రరాజ్యం అమెరికాలో రెండు వేరు వేరు చోట్ల కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు దాడులకు సంబంధించిన వివరాల

Americaలో రెండు చోట్ల కాల్పుల కలకలం.. ఈ ఘటనలపై పోలీసులు ఏమన్నారంటే..

ఎన్నారై డెస్క్: గన్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన అగ్రరాజ్యం అమెరికా(America)లో రెండు వేరు వేరు చోట్ల కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



కాలిఫోర్నియా(California)లోని లాస్ ఏంజిల్స్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం తుపాకీ(Gun) తూటా పేలింది. సాన్ పెండ్రో(San Pedro)లో ఉన్న పీక్ పార్క్ వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడ్డవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అనుమానితుడికి సంబంధించిన ఆధారాలేవి ఇంకా లభించలేదన్నారు. దాడిలో ఎంత మంది పాల్గొన్నారన్నదానిపై స్పష్టత లేదని చెప్పారు. అయితే తర్వలోనే దుండగులను అదుపులోకి తీసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. వాషింగ్టన్‌(Washington)లో కొంత మంది మధ్య ఏర్పడిన వివాదం కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో  ఒకరు మరణించగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ వాళ్లు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-25T17:09:11+05:30 IST