గున్న ఏనుగు పుట్టింది...

ABN , First Publish Date - 2022-07-01T08:38:50+05:30 IST

గున్న ఏనుగు పుట్టింది...

గున్న ఏనుగు పుట్టింది...

పార్వతీపురం, జూన్‌ 30: పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల గుంపులోకి మరో పిల్ల ఏనుగు చేరింది. గురువారం కొమరాడ మండలంలోని గుణానుపురం, దుగ్గి గ్రామాల మధ్య ఒక ఏనుగు ప్రసవించింది. దీంతో వాటి సంఖ్య ఇప్పుడు ఏడుకుచేరింది. తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు చుట్టూ గుంపులోని ఇతర  ఏనుగులు కొద్దిసేపు రక్షణగా నిలిచాయి. పిల్ల ఏనుగును దాని తల్లి మెల్లగా కదిలించి, నిలబెట్టింది. అది నడక మొదలుపెట్టగానే... మంద మొత్తం కదిలి వెళ్లిపోయింది.

Updated Date - 2022-07-01T08:38:50+05:30 IST