Minister kodali వ్యాఖ్యలను ఖండించిన రేషన్ డీలర్ల అసోసియేషన్

ABN , First Publish Date - 2021-10-27T18:10:32+05:30 IST

రేషన్ డీలర్ల సమ్మెపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను రేషన్ డీలర్లు అసోసియేషన్ ఖండించింది.

Minister kodali వ్యాఖ్యలను ఖండించిన రేషన్ డీలర్ల అసోసియేషన్

గుంటూరు: రేషన్ డీలర్ల సమ్మెపై  మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను రేషన్ డీలర్లు అసోసియేషన్ ఖండించింది. రేషన్ డీలర్ల సమ్మె చేస్తుంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించడం బాధాకరమని రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లీల మాధవరావు అన్నారు. ప్రభుత్వం డీలర్లను బెదిరించడం మానుకొవాలని... తమను వారి బిడ్డలు గా భావించి సమస్య పరిష్కరించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డీలర్ల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానం కలుగుతోందన్నారు. డీలర్ల సమస్యలపై ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించామని ఆయన తెలిపారు.  ప్రత్యామ్నాయ పరిస్థితుల్లోనే సమ్మె చేయాల్సి వస్తోందని చెప్పారు. గోతాలపై ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ కూడా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంటింటికి రేషన్ అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా స్వాగతించామని లీల మాధవరావు పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-27T18:10:32+05:30 IST