AP: నగరంపాలెంలో రేషన్ షాపును పరిశీలించిన బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2021-09-18T17:27:14+05:30 IST

జిల్లాలోని నగరంపాలెంలో రేషన్ షాపును బీజేపీ నేతలు పరిశీలించారు. ప్రధాని మంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన కింద వచ్చిన రేషన్ పంపిణీపై ఆరా తీశారు.

AP: నగరంపాలెంలో రేషన్ షాపును పరిశీలించిన బీజేపీ నేతలు

గుంటూరు: జిల్లాలోని నగరంపాలెంలో రేషన్ షాపును బీజేపీ నేతలు పరిశీలించారు. ప్రధాని మంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన కింద వచ్చిన రేషన్ పంపిణీపై ఆరా తీశారు. రేషన్ షాపులు వద్ద, రేషన్ వ్యాన్‌పై మోదీ ఫోటో లేకపోవడం బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్ షాపు వద్ద గరీభ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో బీజేపీ నేతలు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, రావెల, శనక్కాయల అరుణ, పాటిబండ్ల రామకృష్ణ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ కొవిడ్ సమయంలో ఒక్కోక్కరి 5 కిలోల బియ్యం కేంద్రం ఉచితంగా ఇచ్చిందన్నారు. సొమ్ము ఒకరిది, సోకు ఒకరిదిగా జగన్ వ్యవహారం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఇచ్చే రేషన్‌లో 30 శాతం కేంద్రం సబ్సీడీ ఇస్తుందని తెలిపారు. కానీ కేంద్రం చేసే సాయం ఎక్కడా చెప్పడం లేదని మండిపడ్డారు. వైఎస్, జగన్‌ల ఫోటోలతో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఇది మంచి పద్దతి కాదని, ప్రతి రేషన్ షాపు వద్ద మోదీ ఫోటో పెట్టాలని రావెల డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-18T17:27:14+05:30 IST