గుంటూరు జిల్లా: ఏపీ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంత వరకు రెవిన్యూ డివిజన్లలో ఎక్కడా ఎటువంటి ఏర్పాట్లు జరగలేదు. అయితే గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారుల నియామకం జరిగింది. ఇప్పటికే మండల కార్యాలయాల నుంచి పంచాయతీలకు సామాగ్రి చేరింది. నామినేషన్ల స్వీకరణకు ఉన్నతాధికారులు సిద్దంగా ఉన్నారు.