
Guntur జిల్లా: ఉండవల్లి (Undavalli) కరకట్ట రైతులు (farmers) జగన్ (Jagan) ప్రభుత్వం పరువును మరోసారి ఫ్లెక్సీ (Flexi) రూపంలో తీశారు. రోడ్డు పక్కన ఫ్లెక్సీ కట్టి మరీ నిరసన తెలిపారు. తమకు నష్టపరిహారం చెల్లించకుండా పొలాల్లోకి రావద్దంటూ హుకూం జారీ చేశారు. కరకట్ట వెంబడి మంత్రులు, ఐఏఎస్ అధికారులు, వ్యాపారస్తులు ప్రయాణం చేస్తుంటారు. అందరికీ కనపడేలా రైతులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తమ స్వరాన్ని ఫ్లెక్సీ రూపంలో వినిపించారు.
వారం రోజుల క్రితం కరకట్టలో వెడల్పు చేయడానికి అధికారులు క్షేత్రస్థాయిలోకి రాగా రైతులు అడ్డుకున్నారు. ఇది వైరల్గా మారడంతో అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఫ్లెక్సీ వెలువడడంతో రాజధాని ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇప్పటికే చాలా మంది కాంట్రాక్టర్లు టెండర్లకు స్పందించకపోవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడగా... ఇప్పుడు ఫ్లెక్సీల ఏర్పాటు వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
ఇవి కూడా చదవండి