
గుంటూరు జిల్లా (Guntur district): ఏపీ (AP)లో ఫైనాన్స్ (Finance) సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రుణాల వసూలు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. షూరిటీ (Surity) ఉన్నవారికి ఫోన్లు చేసి బండ బూతులు తిడుతున్నారు. గుంటూరు జిల్లా, మంగళగిరిలో బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance) సిబ్బంది బూతుల పర్యం వైరల్‌గా మారింది. నవలూరులో లోన్ తీసుకున్న ఓ వ్యక్తి సకాలంలో డబ్బు చెల్లించకపోవడంతో ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికి బజాజ్ ఫైనాన్స్ సిబ్బంది ఫోన్ చేశారు. డబ్బులు ఎందుకు చెల్లించలేదని అసభ్యంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితులు మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి