గుంటూరు జిల్లా: సుబాబుల్, జామాయిల్ రైతుల కష్టాలు

ABN , First Publish Date - 2022-01-09T20:21:06+05:30 IST

రైతులకు సరైన సాగునీరు వసతి లేకపోవడంతో సుబాబుల్, జామాయిల్ తోటలు వేశారు. గతంలో...

గుంటూరు జిల్లా: సుబాబుల్, జామాయిల్ రైతుల కష్టాలు

గుంటూరు జిల్లా: రైతులకు సరైన సాగునీరు వసతి లేకపోవడంతో సుబాబుల్, జామాయిల్ తోటలు వేశారు. గతంలో రైతులకు లాభదాయకంగా ఉన్న సుబాబుల్ సాగు ప్రస్తుతం అద్వాన్నంగా మారింది. ధరలు పతనమై కొనేవారు కరువుకావడంతో రైతులు కుంగిపోతున్నారు. ఒకప్పుడు రైతులకు కాసులు కురిపించిన ఈ పంట.. ఇప్పుడు అదే రైతులకు పెనుభారంగా మారింది. ప్రభుత్వం తరఫున కూడా గిట్టుబాటు ధర కల్పిస్తామన్న భరోసా కూడా కరువైంది. ఈ స్థితిలో పంట ఉంచాలో.. తొలగించాలో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయినకాడికి తెగనమ్ముకుని ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవడం మినహా గత్యంతరం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-09T20:21:06+05:30 IST