జీజీహెచ్‌లో బ్రెస్ట్‌ క్లినిక్‌

ABN , First Publish Date - 2021-03-09T05:55:19+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి నాట్కో సెంటర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన బ్రెస్ట్‌ క్లినిక్‌ను కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ప్రారంభించారు.

జీజీహెచ్‌లో బ్రెస్ట్‌ క్లినిక్‌
బ్రెస్ట్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌

గుంటూరు(మెడికల్‌) మార్చి 8:  అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి నాట్కో సెంటర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన బ్రెస్ట్‌ క్లినిక్‌ను కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు రొమ్ము సంబంధిత ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి, చికిత్స చేయడానికి  జీజీహెచ్‌ వేదికగా మారడం అభినందనీయమన్నారు. ఆస్పత్రిలోని బ్రెస్ట్‌సెంటర్‌లో స్పెషలిస్ట్‌ వైద్యుడు అందుబాట్లో ఉండి రొమ్ము సంబంధిత జబ్బులకు తగిన వైద ్యం అందిస్తారని తెలిపారు. వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రాఘవేంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని  ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రుల్లో ఈ తరహా బ్రెస్ట్‌ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జేసీ ప్రశాంతి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌ ప్రభావతి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఎస్‌ నాగేశ్వరమ్మ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌ బాబులాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ పద్మావతిదేవి, రమణ యశస్వి, ప్లాస్టిక్‌ సర్జన్‌ సుమిత శంకర్‌, నళిని, దుర్గా ప్రసాద్‌, వెంకటేశ్వరరావు, నాట్కో కోఆర్డినేటర్‌ వై అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అంత ర్జాతీయ మహిళా దినోత ్సవం పురస్కరించుకొని వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యులు, నర్సులను సన్మానించారు. 


Updated Date - 2021-03-09T05:55:19+05:30 IST