విద్యావ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పు: Home minister

ABN , First Publish Date - 2021-10-05T19:16:10+05:30 IST

గతంలో హైస్కూలుకు వెళ్ళాలంటే మండల కేంద్రాలకు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళమని...అప్పట్లో యుక్తవయస్సు రాగానే స్కూలు మాన్పించి పెళ్ళి చేసేవారని హోంమంత్రి సుచరిత అన్నారు.

విద్యావ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పు: Home minister

గుంటూరు: గతంలో హైస్కూలుకు వెళ్ళాలంటే మండల కేంద్రాలకు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళమని...అప్పట్లో యుక్తవయస్సు రాగానే స్కూలు మాన్పించి పెళ్ళి చేసేవారని హోంమంత్రి సుచరిత అన్నారు. సీఎం జగన్ విద్యావ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పు చేశారని తెలిపారు. టాయిలెట్స్ లేకపోవటంతో స్కూలు మానేస్తున్నారన్నారు. నాడు నేడుతో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. పీరియడ్స్ టైంలో పడే ఇబ్బందులు గుర్తించే స్వేచ్చ కార్యక్రమాన్ని సీఎం తీసుకొచ్చారని అన్నారు. దేశం మొత్తం ఇటువంటి కార్యాక్రమాన్ని అమలు చేసే అవకాశం ఉందని చెప్పారు. చదువుకునే ఆడపిల్లలు సంకెళ్ళు తెంచుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరు దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-05T19:16:10+05:30 IST