
గుంటూరు: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) ప్రవేశపెట్టిన పే అండ్ ప్లే (Pay and Play) విధానాన్ని వ్యతిరేకిస్తూ క్రీడాకారులు, తల్లిదండ్రులు ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వం నిర్ణయంతో పేద, మధ్య తరగతి పిల్లలు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. పే అండ్ ప్లే విధానానికి వ్యతిరేకంగా గుంటూరు బీఆర్ స్టేడియంలో తల్లిదండ్రులు నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే కోచ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ప్రభుత్వం పే అండ్ ప్లే విధానాన్ని తీసుకువచ్చి రూ. 2 వందల ఫీజును రూ. 2 వేలు చేసిందని, యోగాకు సంబంధించి రూ. 50 నుంచి వెయ్యి చేసిందని, ఎంట్రీ ఫీజు రూ. 3వేలు చేసిందని చెప్పారు. ఈ విధానం వలన పేద, మధ్య తరగతి పిల్లలు క్రీడలకు దూరమవుతారని కోచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి