అడవి తక్కెళ్లపాడు కోవిడ్ కేర్ సెంటర్‌ని సందర్శిస్తోన్న జేసీ రాజకుమారి
గుంటూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున కొవిడ్ కేర్ సెంటర్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్(సచివాలయాలు) జి.రాజకుమారి ఆదేశించారు. శనివారం ఆమె అడవితక్కెళ్లపాడులోని ఏపీ టిడ్కో భవనాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ సమకూర్చారో అడిగి తెలుసుకొన్నారు. వాటర్, డస్టుబిన్, పడకలను పరిశీలించారు. రక్తపరీక్షలు, ఎక్స్-రే గదులు, స్టోర్స్ అండ్ స్టాఫ్ రూంలు తనిఖీ చేశారు. జేసీ వెంట నోడల్ అధికారి డాక్టర్ లక్ష్మానాయక్, డ్వామా పీడీ యుగంధర్‌కుమార్, టాండన్ పాల్గొన్నారు.