గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

May 9 2021 @ 11:51AM

గుంటూరు: జిల్లాలోని నరసరావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  బైక్ వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బసికాపురం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వెంకీ, ఏసుబాబుగా పోలీసులు గుర్తించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.