సరోగసీ మెటర్నిటీ లీవ్‌పై హైకోర్టు సంచలన ఆదేశాలు

ABN , First Publish Date - 2022-07-14T23:23:13+05:30 IST

సరోగసీ (Surrogacy) ద్వారా బిడ్డను తీసుకున్న తల్లికి మెటర్నరీ సెలవు మంజూరు చేయాలని హైకోర్టు (High Court) ఆదేశించింది. పెదనందిపాడు..

సరోగసీ మెటర్నిటీ లీవ్‌పై హైకోర్టు సంచలన ఆదేశాలు

గుంటూరు (Guntur): సరోగసీ (Surrogacy) ద్వారా బిడ్డను తీసుకున్న తల్లికి మెటర్నరీ సెలవు మంజూరు చేయాలని హైకోర్టు (High Court) ఆదేశించింది. పెదనందిపాడు మండలం ఉప్పలపాడు హైస్కూల్‌‎లో పని చేసే టీచర్‌ (Teacher)కు మెటర్నరీ లీవ్‌ ఇవ్వకపోవడంపై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు..మెటర్నిటీ లీవ్‌ (Maternity Leave) ఇవ్వాల్సిందేనని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ, ఆ తరువాత ఆ బిడ్డకు అండం ఇచ్చిన తల్లికీ మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాల్సిందేనని హైకోర్టు సూచించింది.  అలాగే బిడ్డను పెంచేందుకు తల్లికి మూడు నెలల పాటు మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాలని ఆదేశించింది.  మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట్‌ 2017కు తెచ్చిన సవరణల ద్వారా మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. 


Updated Date - 2022-07-14T23:23:13+05:30 IST