Advertisement

టీడీపీ అభివృద్ధి కోసం పాటుపడతా

Oct 25 2020 @ 07:25AM

ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం

ప్రమాణస్వీకార సభలో జీవీ ఆంజనేయులు


నరసరావుపేట(గుంటూరు): తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పాటుపడతానని ఆ పార్టీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తెలిపారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాల యంలో శనివారం జరిగిన సభలో అయన ప్రమాణస్వీకారం చేశారు. ఈ సం దర్భంగా జీవీ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఎన్‌టీఆర్‌ అశయ సాధనకోసం శక్తి వంచనలేకుండా కృషిచేస్తాన న్నారు. చంద్రబాబు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పా రు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజలకు పార్టీ అండగా నిలు స్తుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధే దివంగత డాక్టర్‌ కోడెల శివప్రసా దరావు అశయమని దీనిని సాధించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావా ల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో దుర్మార్గపాలనకు చరమగీతం పా డాలన్నారు. ఇందుకోసం అందరం సమైక్యంగా పోరాడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


పార్టీ నేతలు కార్యకర్తల సహకారంతో నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో తెలుగు దేశం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. పార్టీశ్రేణులపై తప్పుడుకేసులు బనా యిస్తున్న వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని, ఏకార్యకర్తకు అన్యాయం జరిగినా సహించేదిలేదని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు. అమరావతి రాజధానిని ఈ ప్ర భుత్వం సమాధి  చేయాలని చూస్తున్నదని విమర్శించారు. ఎక్కడ చూసినా అవినీతి పాలన, దౌర్జన్యాలు, గుండాయిజం సాగుతున్నదని చెప్పారు. అబివృద్ధిని విస్మరించి రాష్ర్టాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నా రు. అక్రమ కేసులు బనాయిస్తున్నవారికి తగిన బుద్ధిచెబుతామని జీవీ హెచ్చరించారు. 


ఎవరినీ వదిలేది లేదు: యరపతినేని

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి జైళ్ళకు పంపిస్తున్నారని చెప్పారు. ఏ పోలీసులు అయితే తెలుగుదేశం ఫ్లెక్సీలు తీశారో ఆ పోలీ సులచేతే ఫ్లెక్సీలు కట్టించే రోజలు దగ్గర లోనే ఉన్నాయన్నారు. ఎవరైతే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారో వారికి తగిన బుద్ధి చెబుతామని.. వైసీపీ నేతలు ఖబడ్డార్‌ అంటూ హెచ్చరించారు. వైసీపీ చేస్తున్న పనులను డైరీలో రాస్తు న్నాం.. ఎవరినీ  వదలిపెట్టేది లేదన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి.. అరాచకాలు చేయడానికి కాదన్నారు. పోరాట పటిమను పార్టీశ్రేణులు ప్రదర్శిం చాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. పార్లమెంట్‌తో పాటు 7 స్థానాలలో విజయబావుటా ఎగుర వేసేందుకు పార్టీ శ్రేణులు కొదమ సింహాల్లా పోరా డాలని యరపతినేని పిలుపునిచ్చారు.


సైనికుల్లా పనిచేయాలి: శ్రావణకుమార్‌

టీడీపీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్‌ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీకోసం సైనికుడిలా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్‌ ఇచ్చింది తెలు గుదేశం అని చెప్పారు. బీసీలను చీలేందుకే కార్పొరేషన్ల ఏర్పాటన్నారు.  ఈ ప్రభుత్వం ప్రజలను కులాలవారీగా చీలుస్తున్నదుకే కుట్రపన్నిం దని దీనిని ఛేదించాలన్నారు. సభలో మాజీ మంత్రి  పుల్లారావు, నక్కా అనందబాబు, ఎమ్మెల్సీ డాక్టర్‌ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్‌, నరసరావుపేట అసెంబ్లీ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, మాచర్ల ఇన్‌చార్జి చలమారెడ్డి, పార్టీ నేతలు దాసరి రాజామాస్టారు గోనుగుంట్ల కోటేశ్వరరావు, దివ్యవాణి, లాల్‌వజీర్‌, మన్నవ సుబ్బారావు, దాసరి ఉదయశ్రీ, వందనాదేవి, కడియాల రమేష్‌, వల్లెపు నాగేశ్వరరావు, కొల్లి బ్రహ్మయ్మ తదితరులు పాల్గొన్నా రు. జీవీ అంజనేయులచేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్ర మాణం చేయించారు. అనంతరం జీవీని నేతలు ఘనంగా సన్మానించారు. 


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.